శ్రీలంక పేలుళ్లు: అలసటతో బతికిపోయా

| Edited By:

Apr 24, 2019 | 12:36 PM

శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ శనక తమ దేశంలో ఇటీవల జరిగిన పేలుళ్ల నుంచి బతికి బయటపడ్డాడు. తన సొంతూరు నెగొంబోలో ఉన్న చర్చిలో ఎప్పుడూ ప్రార్థనలకు హాజరయ్యే శనక.. ఈస్టర్‌కు ముందురోజు ఎక్కువసేపు ప్రయాణంలో ఉన్న కారణంగా అలసటతో ప్రార్థనలకు వెళ్లలేకపోయానని, అదే తన ప్రాణాన్ని కాపాడిందని చెప్పుకొచ్చాడు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో నాటి ఘోర ఘటనను వివరించిన ఆయన.. పేలుళ్లలో చర్చి మొత్తం ధ్వంసమైందని, నాటి దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. స్థానిక ఆసుపత్రి వంద […]

శ్రీలంక పేలుళ్లు: అలసటతో బతికిపోయా
Follow us on

శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ శనక తమ దేశంలో ఇటీవల జరిగిన పేలుళ్ల నుంచి బతికి బయటపడ్డాడు. తన సొంతూరు నెగొంబోలో ఉన్న చర్చిలో ఎప్పుడూ ప్రార్థనలకు హాజరయ్యే శనక.. ఈస్టర్‌కు ముందురోజు ఎక్కువసేపు ప్రయాణంలో ఉన్న కారణంగా అలసటతో ప్రార్థనలకు వెళ్లలేకపోయానని, అదే తన ప్రాణాన్ని కాపాడిందని చెప్పుకొచ్చాడు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో నాటి ఘోర ఘటనను వివరించిన ఆయన.. పేలుళ్లలో చర్చి మొత్తం ధ్వంసమైందని, నాటి దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.

స్థానిక ఆసుపత్రి వంద మృతదేహాలతో నిండిపోయిందని.. పేలుడు వల్ల వచ్చిన శకనాల కారణంగా అనేక మంది గాయపడ్డారని శనక తెలిపారు. కాగా పేలుడు జరిగిన సమయంలో శనక తల్లి, నానమ్మ అదే చర్చిలో ఉండగా.. వారిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తమ ప్రదేశం పేలుళ్లతో భీతావహంగా మారిందని, వీధుల్లోకి వెళ్లాలంటేనే చాలా భయంగా ఉందని శనక పేర్కొన్నాడు.