Queen elizabeth ii: క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆహ్వానం అందని దేశాలు ఇవే.. కారణమేంటో తెలుసా.?

|

Sep 19, 2022 | 1:23 PM

Queen elizabeth ii: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II అంత్యక్రియలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్‌ అబేలో అంత్యక్రియలను మరికాసేపట్లో నిర్వహించనున్నారు. రాణి మరణానంతరం 11 రోజుల సంతాప దినాల అనంతరం...

Queen elizabeth ii: క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆహ్వానం అందని దేశాలు ఇవే.. కారణమేంటో తెలుసా.?
Queen Elizabeth Ii
Follow us on

Queen elizabeth ii: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II అంత్యక్రియలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్‌ అబేలో అంత్యక్రియలను మరికాసేపట్లో నిర్వహించనున్నారు. రాణి మరణానంతరం 11 రోజుల సంతాప దినాల అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి. రాణి అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. మన దేశం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఇక బ్రిటన్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాణి అంత్యక్రియలను బ్రిటన్ లోని 125 సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే రాణి అంత్యక్రియలకు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన వారికి ఆహ్వానం అందాయి. అయితే కొన్ని దేశాలకు ఆహ్వానం అందలేవు. ఇంతకీ ఏయే దేశాలకు అంత్యక్రియలకు ఆహ్వానం అందలేదు. దానికి కారణం ఏంటి.? అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

* సరైన సంబంధాలు లేని కారణంగా ఇరాన్‌, నికరాగువా, నార్త్‌ కొరియా దేశాలకు చెందిన అధినేతలకు యూకే ఆహ్వానించలేదు. కేవలం ఆయా దేశాల అంబాసిడర్‌లకు మాత్రమే ఆహ్వానం పంపించింది.

ఇవి కూడా చదవండి

* ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో బ్రిటన్‌ మినహాయించిన దేశాల జాబితాలో రష్యా, బెలారస్‌ దేశాలు ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనకు బ్రిటన్‌కు వెళ్లడానికి ప్రయాణ ఆంక్షలు ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరుకావడం లేదని ఇప్పటికే ప్రకటించారు. బ్రిటన్‌ రాణి అంత్యక్రియలకు ఆహ్వానించకపోవడం అనైతికమని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గురువారం అన్నారు. అయితే లండన్‌లో రష్యా, బెలారస్‌ రాయబార కార్యాలయాలు ఉన్నాయి. వీటికి చెందిన అధ్యక్షులు కింగ్‌ చార్లెస్‌ IIIకి సంతాప సందేశాలను పంపించారు.

* క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు ఆహ్వానం అందని జాబితాలో తాలిబాన్‌ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌, మయన్మార్‌, సిరియా, వెనుజులా వంటి దేశాలు కూడా ఉన్నాయి. గతేడాది జరిగిన సంఘటనల నేపథ్యంలో మయన్మార్‌కు బ్రిటన్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..