Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై వెంటనే దాడులను నిలిపివేయాలి.. యూఎన్‌జీఏలో తీర్మానం ఆమోదం.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా (Russia Ukraine) చేస్తోన్న సైనిక చర్యను ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా చేస్తున్న దాడులపై..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై వెంటనే దాడులను నిలిపివేయాలి.. యూఎన్‌జీఏలో తీర్మానం ఆమోదం.
Unga Voting

Updated on: Mar 02, 2022 | 11:22 PM

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా (Russia Ukraine) చేస్తోన్న సైనిక చర్యను ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా చేస్తున్న దాడులపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో (UNGA) ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో ఉక్రెయిన్‌పై దాడిని నిలిపివేయాలని తీర్మానం చేశారు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండించాలని చేసిన తీర్మానానికి మొత్తం 141 దేశాలు మద్దతు తెలిపాయి. ఇక ఐదు దేశాలు రష్యాకు మద్దతు ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉంటే భారత్‌ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. భారత్‌తో పాటు మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే దాడులు నిలిపివేయాలని, రష్మా బలగాలను వెనక్కి రప్పించాలని ఈ తీర్మానం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానానికి కూడా భారత్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 11 దేశాలు మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇప్పుడు యూఎన్‌జీఏలో చేసిన తీర్మానికి కూడా భారత్‌ దూరంగా ఉంది.

ఇక ఉక్రెయిన్‌లో నెలకొన్ని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని మోదీ కోరారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. భారతీయ విద్యార్థులకు సేఫ్‌ ప్యాసేజ్‌ కల్పించేందుకు రష్యా అంగీకరించింది. ఇండియన్ స్టూడెంట్స్ ఖార్కివ్ వీడి వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు కల్పించింది రష్యా. ఈ క్రమంలో ఖార్కియెవ్‌లోని భారతీయులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. వాహనాలు, బస్సులు అందుబాటులో లేకపోతే కాలినడకనన అక్కడి నుంచి తరలివెళ్లమని సూచించింది. అక్కడి నుంచి PESOCHIN 11 కి.మీ దూరంలో ఉందని, BABAYE 12 కి.మీ, BEZLYUDOVKA 16 కి.మీ దూరంలో ఉన్నాయని వెల్లడించింది.

Also Read: బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా.. పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

Russia-Ukraine War: రష్యా దాడుల బీభత్సం… కాలినడకన ఉక్రెయిన్‌ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరో!