Free Condoms: లవర్స్ డే రోజున 9 కోట్ల ఫ్రీ కండోమ్స్ పంపిణీ.. అసలు స్కెచ్ ఏమిటో తెలిస్తే షాక్ అవాల్సిందే..

|

Feb 03, 2023 | 7:30 AM

వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక దేశం తమ దేశవ్యాప్తంగా 95 మిలియన్ల ఉచిత కండోమ్స్ పంపిణి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దేశం మరేదో కాదు.. పర్యాటకులు స్వర్గధామంగా..

Free Condoms: లవర్స్ డే రోజున 9 కోట్ల ఫ్రీ కండోమ్స్ పంపిణీ.. అసలు స్కెచ్ ఏమిటో తెలిస్తే షాక్ అవాల్సిందే..
Condoms
Follow us on

ప్రపంచవ్యాప్తంగా జరుపునే వేడుకలలో వాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కూడా ఒకటి. ప్రేమికుల కోసమే అంకితం చేసిన దినోత్సవం ఇది. అందుకే ప్రేమికుల సౌలభ్యం కోసమే అన్నట్టుగా.. ప్రేమికులు ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఓ దేశం విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక దేశం తమ దేశవ్యాప్తంగా 95 మిలియన్ల ఉచిత కండోమ్స్ పంపిణి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దేశం మరేదో కాదు.. పర్యాటకులు స్వర్గధామంగా భావించే థాయిలాండ్. అవును.. థాయిలాండ్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా 95 మిలియన్ల కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొత్తం ఆ రోజునే చేస్తారని అనుకోకండి.. ఫిబ్రవరి 1 నుంచే థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది.

ఇంతకీ ఎందుకు ఈ ఫ్రీ కండోమ్స్..? 
ఒక దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఫ్రీగా కండోమ్స్ పంపిణి చేస్తోందంటే.. జనాభా పెరగకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయమని అనుకుంటారు. కానీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేస్తున్నారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఎక్కడో తేడా కొడుతోంది అనిపిస్తోంది కదా..! అవును.. మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఇలా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడంలో కూడా ప్రజాహితం ఉందంటోంది థాయిలాండ్ ప్రభుత్వం. థాయిలాండ్ ప్రభుత్వం చెబుతున్న ప్రజా ప్రయోజనం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే కంటే ముందుగా ఫ్రీ కండోమ్స్ పంపిణి చేయడం వల్ల సుఖ వ్యాధులు (సెక్సువల్లీ ట్రాన్స్‌మిట్టెడ్ డిసీజెస్-ఎస్టీడీ) వ్యాపించకుండా ఉండటంతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీని నివారించవచ్చని.

టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే మైనర్‌గా ఉన్నప్పుడే గర్భం దాల్చడం అన్నమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ 95 మిలియన్ల కండోమ్స్ పంపిణి చేయాలనే లక్ష్యంతో దీనిని ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమంగా భావిస్తూ ఫిబ్రవరి 1 నుంచే కండోమ్స్ పంపిణి చేయడం ప్రారంభించింది ఆ దేశ ప్రభుత్వం. సుఖ వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు, టీనేజ్‌లోనే గర్భం దాల్చే ఘటనలను నివారించేందుకు థాయిలాండ్ తీసుకున్న ఈ నిర్ణయంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనం సంగతి అంటుంచితే.. థాయిలాండ్ ప్రభుత్వం పరోక్షంగా ఏం ప్రోత్సహిస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు ఆ దేశ ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.