Elon Musk Vs Putin: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంచనలమైన సవాలు విసిరారు. తనతో పోరాడేందుకు సిద్ధమా అంటూ ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్ చేశారు. ‘నాతో పోరాడేందుకు పుతిన్‌కు సవాలు విసురుతున్నా’ అంటూ తన ట్వీట్ లో రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేశారు. పైగా రష్యన్ భాషలోనే పుతిన్ పేరును అందులో రాశారు. ఈ పోరులో గెలిచినవారే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగాలా, ఆగిపోవాలా నిర్ణయిస్తారు అని అర్థం వచ్చేలా ‘ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు’ అంటూ తన ట్వీట్‌లో మస్క్ ప్రస్తావించారు.
ఎలాన్ మస్క్ ట్వీట్రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్లకు ఎలాన్ మస్క్ గతంలోనూ తనవంతు సాయం చేశారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించారు. తద్వారా అక్కడి ప్రజలకు ప్రపంచంలో సంబంధం తెగిపోకుండా సహాయం చేశారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లో అంతర్జాలసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. కీలక సమయంలో ఉక్రేనియన్లకు బాసటగా నిలిచి మరిన్ని టెర్మినళ్లను ప్రారంభించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ ట్వీట్లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
I hereby challenge
Владимир Путин
to single combatStakes are Україна
— Elon Musk (@elonmusk) March 14, 2022
ఇవీ చదవండి..
డెట్ ఈక్విటీ నిష్పత్తి అంటే ఏమిటి.. పెట్టుబడికి ముందు దానిని ఎందుకు చూడాలి..
DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..