Terrorist Attack: పాకిస్తాన్ ఆర్మీపై ఉగ్రదాడి.. ఏడుగురు సైనికుల దుర్మరణం.. ఈ నెలలో ఇది రెండో దాడి!

|

Sep 15, 2021 | 9:36 PM

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుఖ్వాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు సైనికులు మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఈ నెలలో పాక్ ఆర్మీపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండో సారి.

Terrorist Attack: పాకిస్తాన్ ఆర్మీపై ఉగ్రదాడి.. ఏడుగురు సైనికుల దుర్మరణం.. ఈ నెలలో ఇది రెండో దాడి!
Terroris Attack
Follow us on

Terrorist Attack: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుఖ్వాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు సైనికులు మరణించారు. 16 మంది గాయపడ్డారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ సైన్యంలోని ఒక విభాగం నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించడానికి ఇక్కడకు వెళ్లింది. ఈ సమయంలో, ఉగ్రవాదులు వారిని  చుట్టుముట్టారు. అన్ని వైపుల నుండి కాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు  సైనికులు అక్కడికక్కడే మరణించారు. 17 రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులపై ఇది రెండో దాడి. ఇంతకు ముందు ఘటనలో 5 గురు సైనికులు మరణించారు.

పాక్ ఆర్మీ ప్రకటన..

పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో – ఒక సైనిక బృందం నిఘా కోసం  దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లింది. ఇంతలో ఉగ్రవాదులు ఆ బృందాన్ని చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. ఏడుగురు సైనికులు మరణించారు. మీడియా నివేదికల ప్రకారం, 7 గురు  సైనికులు మరణించగా, 16 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది, ఎందుకంటే వారు చాలా దగ్గర నుండి కాల్పులకు గురయ్యారు. అందువల్ల వారు ఎదురు కాల్పులు జరిపే అవకాశం దక్కలేదు.  ఈ సంఘటన జరిగిన ప్రాంతం మైదాన ప్రాంతం.

దక్షిణ వజీరిస్తాన్‌లో అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇవి ప్రతిరోజూ పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తూనే ఉన్నాయి. గత నెలలో, బజౌర్‌లో కూడా సైన్యంపై దాడి జరిగింది. మీడియా ప్రకారం, ఐదుగురు సైనికులు అందులో మరణించారు. సైన్యం వారి సంఖ్యను రెండుగా చెప్పింది.

ఎవరూ బాధ్యత వహించలేదు,

ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహించలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు, పాకిస్తాన్ తాలిబాన్లు కూడా ఇక్కడ చురుకుగా ఉన్నారు.  వారు తరచుగా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారు.

మంగళవారం ఒక ఇంటర్వ్యూలో, విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి పాకిస్తాన్ తాలిబాన్లను లొంగిపోవాలని కోరారు. ఒక బ్రిటిష్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా ఇలా చెప్పారు – ”వారు తమ తుపాకులు విడిచిపెట్టి రావాలనుకుంటే, మేము దానిని స్వాగతిస్తాము.”

ఇవి కూడా చదవండి:

Apple Smart watch: ఆపిల్ నుంచి కొత్త ఐపాడ్.. స్మార్ట్ వాచ్.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Cancer: కేన్సర్ పరీక్షా విధానంలో సరికొత్త విధానం.. దీనితో వేగంగా వ్యాధిని తెలుసుకోవచ్చు..