కోవిద్ లాక్ డౌన్ ఎంతోమంది ప్రతిభావంతుల జీవితాలను దుర్భరంగా మార్చింది. ఎన్నో కష్టాలకు కారణమైంది. ఓ అంతర్జాతీయ ఫుట్ బాలర్ ఉన్నత భవిషత్తును చిదిమేసింది.సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆమెకు ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. ఝార్ఖండ్ లోని సంగీతా సొరేన్ అనే యువ ఫుట్ బాల్ క్రీడాకారిణి లైఫ్ విషయానికే వస్తే… ధన్ బాద్ లోని బాసాముడి గ్రామానికి చెందిన ఈమె ఇప్పుడు ఇటుకల బట్టీలో దినసరి కూలీగా పని చేయాల్సి వస్తోంది. 2018-19 లో భూటాన్, థాయిలాండ్ లలో జరిగిన అండర్ 17, అండర్ 18 ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని ఈమె పతకాలు సాధించింది. త్వరలో జరిగే పోటీలలో పార్టిసిపేట్ చేయాలని ఆమెను సీనియర్ టీమ్ కూడా ఆహ్వానించింది. కానీ కోవిద్ పాండమిక్ ఆమె ఉజ్వల భవితవ్యానికి అడ్డుగా నిలిచింది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సంగీతా సొరేన్ కుటుంబం పడుతున్న కష్టాలను సోషల్ మీడియా హైలైట్ చేయగా సీఎం హేమంత్ సొరేన్ ఆమె ఫ్యామిలీకి అండగా ఉంటానని, ఆదుకుంటానని హామీ ఇఛ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. ఈమె తండ్రికి వృద్దాప్యం కారణంగా కంటి చూపు పోయింది. ఇక తల్లి, అన్నతో బాటు సంగీత గ్రామంలోని ఇటుకల బట్టీకి పనికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే తమ వైపు కన్నెత్తి అయినా చూడలేదని 20 ఏళ్ళ సంగీత తెలిపింది. తన మనోధైర్యం మాత్రం చెక్కుచెదరలేదని, ఈ లాక్ డౌన్ ముగిశాక తమకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నానని ఆమె అంటోంది.
క్రీడాకారులపట్ల ఈ ప్రభుత్వాలు సీరియస్ గా లేవని అమాయకంగా ఆరోపిస్తోంది. గట్టిగా ఏమైనా అంటే ఈ ఉపాధి కూడా పోతుందేమోన్న భయం ఆమెలో స్పష్టంగా కనిపించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో
వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.