తాలిబన్ల దాడిలో 20 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 20 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్‌ ముర్గాబ్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో తాలిబన్లు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని అప్ఘాన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతి చెందిన వారిలో సైనికులు, పోలీసులు ఉన్నారని తెలిపారు. ఈ దాడిలో మరికొంత మంది భద్రతా బలగాలకు గాయాలయ్యాయని.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా తాలిబన్లతో చర్చలు జరిపే […]

తాలిబన్ల దాడిలో 20 మంది మృతి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2019 | 8:10 PM

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 20 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్‌ ముర్గాబ్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో తాలిబన్లు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని అప్ఘాన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతి చెందిన వారిలో సైనికులు, పోలీసులు ఉన్నారని తెలిపారు. ఈ దాడిలో మరికొంత మంది భద్రతా బలగాలకు గాయాలయ్యాయని.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా తాలిబన్లతో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తుండగానే ఈ దాడులు కొనసాగుతున్నాయి. కాగా, తామే ఈ దాడికి పాల్పడ్డామని తాలిబన్ అధికార ప్రతినిధి ఖారీ యూసఫ్ అహ్మదీ ఓ ప్రకటన విడుదల చేశాడు.