కాబూల్ విమానాశ్రయంలో ఎత్తయిన గోడను ఎలాగో ఎక్కి.. అవతలివైపు దిగడానికి యత్నించిన ఓ ఆఫ్ఘన్ దేశియుడిపై తాలిబన్ ఫైటర్ ఒకడు కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆ వ్యక్తి కాలికి తగలడంతో భయంతో ,మళ్ళీ తాను ఎక్కినా చోటుకే దూకేశాడు. తృటిలో తన ప్రాణాలను ఆ వ్యక్తి రక్షించుకున్నాడు. అశ్వాకా న్యూస్ అనే వార్తా సంస్థ ఈ వీడియో క్లిప్ ను విడుదల చేసింది. గత ప్రభుత్వంలోని పోలీసు మాదిరి తాలిబన్ కూడా వ్యవహరిస్తాడని ఆ అఫన్ నమ్మాడని.. కానీ అలా జరగలేదని ఈ వార్తా సంస్థ పేర్కొంది. తాలిబన్ ఫైటర్ ఏదో భాష మాట్లాడుతూ మరో విధంగా ప్రవర్తించాడని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. అమాయక పౌరుల పట్ల తాము హింసకు దిగబోమని తాలిబన్లు ఇచ్చిన హామీ వట్టి బూటకమని తేలిపోయింది. కాబూల్ నగరంలో ప్రవేశించిన రెండు రోజుకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తే..ఇక రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఏ ఒక్క తాలిబన్ కూడా చేతిలో ఆయుధం లేకుండా కనబడడం లేదు. ఈ కారణం వల్లే ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని ఆఫ్ఘన్లు, చివరకు విదేశీయులు సైతం తమ కుటుంబాలతో సహా విమానాశ్రయం వైపు పరుగులు తీస్తున్నారు. మహిళలు, పిల్లలతో ఎయిర్ పోర్టు రద్దీగా నిండిపోతూ వచ్చింది.
విమానం చక్రాలకు తమను తాము కట్టుకుని చివరకు నింగి నుంచి కింద పడిపోయి మరణించిన ఇద్దరు వ్యక్తుల ఉదంతం ప్రపంచాన్నే షాక్ కి గురి చేసింది. విమానం ఇంజను పైకెక్కినవాళ్లు కొందరైతే ప్లేన్ రన్ వే పై టేకాఫ్ అవుతుండగా దానివెనుకే పరుగెట్టినవారు కొందరు.. ఈ దృశ్యాలను చూసి జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ చలించిపోయి..ఈ విషాదానికి మనమే కారకులమని వ్యాఖ్యానించారు, ఇది చాలా సిగ్గుచేటైన విషయమన్నారు. జర్మనీ కాబూల్ నుంచి తమ ఏడుగురు పౌరులను మాత్రమే రక్షించుకోగలిగిందీ.
Taliban Fighter shooting on a man trying to enter to the #kabulairport, He actually expected the Taliban to behave like the police of the previous Government, while No, Taliban speak another language of behavior. pic.twitter.com/3T8tcl4joY
— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) August 17, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.
జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.