ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇటీవల మాషా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి పోలీసుల దాడిలో మృతి చెందింది. ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఇరాన్‌లో నిరసనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక స్వీడిష్ యూరో ఎంపీ ఇరాన్ మహిళలకు మద్దతుగా పార్లమెంటులో తన జుట్టును కత్తిరించుకుని ఉద్యమానికి మద్ధతునిచ్చారు. టెహ్రాన్‌పై EU చర్యకు తన వంతుగా పిలుపునిచ్చారు. EUలోని ప్రజలు, పౌరులు, ఇరాన్‌లో మహిళలు, పురుషులపై జరిగే అన్ని హింసలను బేషరతుగా తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సెంట్రిస్ట్ రెన్యూ గ్రూపుకు చెందిన అబిర్ అల్-సహ్లానీ మంగళవారం చేసిన ఈ ప్రకటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు విముక్తి లభించే వరకు మా ఆవేశం అణచివేతదారుల కంటే పెద్దదిగా ఉంటుందన్నారు. ఇరాన్ మహిళలు స్వేచ్ఛగా ఉన్నంత వరకు, మేము మీతో పాటు నిలబడతాము అంటూ ఆమె కత్తెరతో ఆమె తన జుట్టును కత్తిరించుకుని నిరసన వ్యక్తం చశారు. మహిళలు, జీవితం, స్వేచ్ఛ! అంటూ ఆమె గట్టి అరిచి చెప్పారు. పార్లమెంటు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆమె తన జుట్టు చేతిలో పట్టుకుని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Member of the European Parliament, Abir Al-Sahlani: “Until the women of Iran are free, we are going to stand with you; JIN, JIAN, AZADΔ
Day 19 of #IranProtests2022 | #MahsaAmini | Kurdistan, Sanandaj | 5 October 2022.#IranRevolution pic.twitter.com/PDfa8xSGaO
— Kaveh Ghoreishi (@KavehGhoreishi) October 5, 2022
మహసా అమిని అనే యువతి హిజాబ్ ధరించలేదని కొన్ని రోజుల క్రితం పోలీసులు ఆమెను కొట్టారు. అయితే ఆమె మరణించడం వల్ల ఇరాన్‌లో నిరసనలు మళ్లీ ఊపందుకున్నాయి. అమిని మృతి పట్ల ఇరాన్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిజాబ్ గురించి పోలీసులు విచారిస్తున్న సమయంలో.. పోలీస్ స్టేషన్‌లోనే అమిని కుప్పకూలినట్లు ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.. కానీ ఇరాన్ పోలీసులు మాత్రం అమినికి గుండెపోటు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ రోజు వరకు అమిని ఆరోగ్యం బాగానే ఉందని ఆమె తల్లితండ్రులు తెలిపారు.