9 నెలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ అండ్ టీమ్…భూమ్మీదకు రావడానికి రంగం సిద్ధం అవుతోంది. ఆమె రాకకు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఎంతోమంది, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టైమ్ దగ్గర పడుతోంది. అతికొద్ది రోజుల్లో ఆమె సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ కాబోతున్నారు. అయితే ఆమె భూమి మీదకు వచ్చాక. మరో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్…ISSలోఉన్న సునీతా విలియమ్స్ బృందాన్ని కలుసుకున్నారు తాజాగా వెళ్లిన నలుగురు వ్యోమగాములు. డాకింగ్, హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ విజయవంతం కాగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు వ్యోమగాములు. ఆ నలుగురికి స్వాగతం పలికింది సునీతా విలియమ్స్ టీమ్. ఆలింగనాలు, కరచాలనాలతో తొమ్మిది నెలల ఒత్తిడి తొలగినట్లయింది. ప్రస్తుతం ISSలో మొత్తం 11 మంది వ్యోమగాములు ఉన్నారు. సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్…రెండురోజుల పాటు హ్యాండోవర్ ప్రక్రియ చేపడతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఇతర వ్యోమగాములకు అప్పగిస్తారు. హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత భూమికి సునీతా, విల్మోర్ ద్వయం చేరుతుంది. వీరిద్దరూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ క్యాప్సూల్‌లో క్షేమంగా భూమికి చేరడం కోసం ఫ్లోరిడాలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అంతరిక్షంలో 9 నెలలు గడపడం ఒక ఎత్తు అయితే, భూమ్మీదకు వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్‌కు చాప్టర్-2 టెస్ట్ మొదలవుతుంది. అత్యంత కఠిన పరీక్షను ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో ఇన్నాళ్లు గడిపి, తిరిగి భూమ్మీదకు వచ్చిన తర్వాత, ఆ వ్యోమగాముల పరిస్థితి ఏంటో చూద్దాం.
భూమ్మీదకు తిరిగి వచ్చాక సునీత అండ్ టీమ్.. ఈ సిట్యువేషన్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అంతరిక్షం నుంచి వచ్చే వ్యోమగాములపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. భూ వాతావరణంతోపాటు, అయస్కాంత క్షేత్రం… మనల్ని రేడియో ధార్మిక ప్రభావం నుంచి రక్షిస్తాయి. అయితే, వ్యోమగాములకు ఇలాంటి రక్షణ అంతరిక్షంలో ఉండదు. ఈ పరిస్థితుల్లో సునీతా విలియమ్స్, విల్మోర్ ఆరోగ్యంపై నాసా ఫోకస్ చేసింది.