శ్రీలంకలో మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొలంబోలోని సెయింట్ ఆంధనీస్ చర్చ్ వద్ద పేలుడు జరిగింది. స్పెషల్ టాస్క్ పోలీసులు బాంబును నిర్వీర్యం చేసే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఇదిలా ఉంటే శ్రీలంలో ఆదివారం జరిగిన పేలుళ్లలో దాదాపు 300మంది మరణించగా.. 500మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే.