SpaceX Starship: 10 నిముషాల్లో ఎగసి, గాల్లోనే పేలిపోయి, స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫెయిల్యూర్, ఎలన్ మస్క్ మౌనం

స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ 'సీరియల్ నెం.10' (ఎస్ ఎన్ 10) ను ప్రయోగించిన పది నిముషాలకే పేలిపోయింది. మంటలు మండిస్తు లాంచ్ పాడ్ పై (భూమిపై) పడిపోయింది.

SpaceX Starship: 10 నిముషాల్లో ఎగసి, గాల్లోనే పేలిపోయి, స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫెయిల్యూర్, ఎలన్ మస్క్ మౌనం

Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 1:46 PM

Yusaku Maezawa SpaceX Moon:స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ‘సీరియల్ నెం.10’ (ఎస్ ఎన్ 10) ను ప్రయోగించిన పది నిముషాలకే పేలిపోయింది. మంటలు మండిస్తు లాంచ్ పాడ్ పై (భూమిపై) పడిపోయింది. గాల్లో ఆరు  మైళ్ళ ఎత్తున ఎగసిన ఈ టెస్ట్ రాకెట్ ఏ కారణం వల్లో ఇలా విఫలమైంది. నిజానికి ఈ ప్రయోగం సక్సెస్ అయిందని ఈ సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ ట్వీట్ చేసినా దీనిపై ఆయన స్పందన పెద్దగా లేదని అంటున్నారు. ఇదివరకటి ఎస్ఎన్ 8, 9 వంటి ప్రోటోటైప్ రాకెట్ల మాదిరి ఇది క్రాష్ కాలేదని ఆయన ట్వీట్ చేసినా దీనికి ఆధారం లేదని అంటున్నారు. లాండింగ్ పాడ్ పై ఈ రాకెట్ సక్సెస్ ఫుల్ గా టచ్ అయిందని ఇది బ్యూటిఫుల్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ సార్ షిప్ అని ఆయన అన్నారు. కాగా ఈ బ్లాస్ట్ కి కారణం తెలియలేదు. బేస్ లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరచుకోలేదని కొందరు ఊహిస్తున్నారు. దేనితో రాకెట్ మీథేన్ వాయువును తొక్కిపెట్టి పైప్స్ ని క్రష్ చేసిందని వారు అభిప్రాయపడుతున్నారు. టెక్సాస్ లోని బోకా చికా నుంచి బుధవరం సాయంత్రం ఈ రాకెట్ ని ప్రయోగించారు.

తన స్పేస్ ఎక్స్ రాకెట్ ని ఏదో ఒక రోజున వ్యోమగాములతో చంద్రునిపైకి, అంగారకునిపైకి పంపాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నారు. తాజా పరిణామంపై ఆయన స్పందిస్తూ తమ టీమ్ గ్రేట్ వర్క్ చేసిందని, ఏదో ఒకరోజున స్టార్ షిప్ ఫ్లైట్స్ సాధారణమే పోతాయని ఆయన అంటున్నారు. కాగా మళ్ళీ తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన పేర్కొంటున్నారు. ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నమూనాలను ఆయన హాలీవుడ్ చిత్రాల్లో వినియోగించిన ప్రోటోటైప్ ఇమేజీలతో పోలుస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

మీ వల్లే ఈ జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది..మరో రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్ కోహ్లీ : Virat Kohli New Record Video

snake Drinking water Viral Video : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించిన వ్వక్తి వైరల్ అవుతున్న వీడియో..!

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!