Space Movie Shooting: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ విజయవంతం.. నాలుగు నెలల పాటు శిక్షణ..!

|

Oct 17, 2021 | 4:07 PM

Space Movie Shooting: రష్యన్‌ సినీ బృందం మొదటిసారిగా అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. రష్య నటి యులియా పెరెసిల్డ్, డైరెక్టర్‌..

Space Movie Shooting: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ విజయవంతం.. నాలుగు నెలల పాటు శిక్షణ..!
Follow us on

Space Movie Shooting: రష్యన్‌ సినీ బృందం మొదటిసారిగా అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. రష్య నటి యులియా పెరెసిల్డ్, డైరెక్టర్‌ క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్‌ ష్కాప్లెరోవ్‌ కజికిస్తాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-18 అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో 12 రోజులు పాటు విజయవంతంగా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షింతంగా ల్యాండ్‌ అయ్యినట్లు రష్యన్‌ స్పేస్‌​ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్‌ వ్యయం విషయం కూడా అ‍త్యంత గోప్యంగా ఉంచారు.

నాలుగు నెలల పాటు శిక్షణ..

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా నాలుగు నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అమెరికాలో అత్యాధునిక రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేసేలా సరి కొత్త రికార్డు తిరగారాయలన్న ఉద్దేశంతోనే రష్యా స్పేస్‌ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

చాలెంజ్‌ సినిమా పేరుతో..

కాగా, ‘చాలెంజ్‌’ అనే పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా అంతరిక్షంలోని వ్యోమోగామీకి గుండె నొప్పి రావడంతో అతనికి చికిత్స చేసేందుకు వెళ్తున్న సర్జన్‌ ఏ విధంగా అంతరిక్షం చేరుకుంటుంది అనేది అంశాలపై ఈ సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది. ఇందులో ఇద్దరూ రష్యన్‌ వ్యోమోగాములు అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ సోయుజ్‌ ఎంఎస్‌-18 అంతరిక్షం నుంచి తిరిగి భూమికి పయనమయ్యే సమయంలో కొంత ఇబ్బంది తలెత్తనప్పటికీ.. అనుకున్న సమయానికి సురక్షితం భూమికి చేరుకున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

China Hypersonic Missile: అణు సంబంధిత హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్షించిన చైనా!

pace Station: అంతరిక్షంలో ఆరు నెలల పాటు.. సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు వెళ్ళిన చైనా వ్యోమగాములు!