దక్షిణ కొరియా నటి ‘లీ’కు ఐదేళ్ల జైలు శిక్ష!

నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ జీవిని పట్టుకోవడం వల్ల దక్షిణ కొరియాకు చెందిన నటి లీకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆమె బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ది కింగ్‌’, ‘మాన్‌స్టర్‌’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. లీ ప్రస్తుతం ‘లా ఆఫ్‌ ది జంగిల్‌’ అనే రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా ఆమె థాయ్‌లాండ్‌లోని ఓ నేషనల్‌ పార్కులో ఏర్పాటు చేసిన షూటింగ్‌లో పాల్గొన్నారు. నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ నీటి […]

దక్షిణ కొరియా నటి 'లీ'కు ఐదేళ్ల జైలు శిక్ష!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2019 | 8:35 PM

నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ జీవిని పట్టుకోవడం వల్ల దక్షిణ కొరియాకు చెందిన నటి లీకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆమె బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ది కింగ్‌’, ‘మాన్‌స్టర్‌’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. లీ ప్రస్తుతం ‘లా ఆఫ్‌ ది జంగిల్‌’ అనే రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా ఆమె థాయ్‌లాండ్‌లోని ఓ నేషనల్‌ పార్కులో ఏర్పాటు చేసిన షూటింగ్‌లో పాల్గొన్నారు. నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ నీటి జీవిని పట్టుకున్నారు. నీటి నుంచి బయటికి వచ్చి.. ‘నేను పట్టుకున్నాను’ అని కేకలు పెట్టారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ జూన్‌ 30న ప్రసారమైంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా థాయ్‌లాండ్‌ అధికారులు కేసు నమోదు చేశారు. అంతరించిపోతున్న ఆ నీటి జీవిని పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ లీపై కేసు నమోదు చేశారు. సదరు టెలివిజన్‌ ఛానెల్‌ క్షమాపణలు కోరింది. థాయ్‌లాండ్‌ చట్టం గురించి తమకు తెలియదని పేర్కొంది. అయినా సరే పోలీసులు నటిపై కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ఆ నటికి రూ.44,650 జరిమానా, ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.

Latest Articles
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..