Coronavirus:రెండేళ్ళ నుంచి కరోనా వైరస్ రెండేళ్ళ నుంచి రకరకాలు రూపాలను సంతరించుకుని మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా(South Africa)లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)కేసులు వివిధ దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ తో దక్షిణాఫ్రికా నాలుగో వేవ్ చవిచూసింది. తాజాగా అక్కడ వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో కోవిడ్ ఆంక్షలను తోలిగిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది.
కొవిడ్ పాజిటివ్ వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే.. అటువంటి వారు ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే కరోనా పాజిటివ్ వచ్చి.. లక్షణాలు కనిపిస్తే.. అటువంటి వారు ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచించింది. కరోనా బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే.. ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని అక్కడ ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు పాఠశాలల్లో స్టూడెంట్ కి స్టూడెంట్ కి మధ్య ఒక మీటరు భౌతికదూరం ఉండాలని విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నామని తెలిపింది.
60 నుంచి 80 శాతం ప్రజల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉందని సీరో సర్వేల్లో వెల్లడైందని…దీంతో కరోనా వైరస్ నిబంధనలు తొలగించడానికి నిర్ణయం తీసుకున్నామని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు.. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్‌తో పాటు ప్రెసిడెంట్ కో ఆర్డినేటింగ్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.
అయితే ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని సూచించింది. ఇప్పటి వరకూ ఎవరినా వ్యాక్సిన్ తీసుకొని వారు ఉంటె.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా నిబంధనలు సడలించడంతో అక్కడ ప్రజలు ఊపిరి పిల్చుకుంటున్నారు.
Also Read: