NASA: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమ్ముకున్న పొగలు.. అలారమ్‌ మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది

|

Sep 11, 2021 | 1:04 PM

 International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంతో అంత‌రిక్ష కేంద్రంలో పొగ వ్యాపించడంతో..

NASA: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమ్ముకున్న పొగలు.. అలారమ్‌ మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది
Follow us on

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంతో అంత‌రిక్ష కేంద్రంలో పొగ వ్యాపించడంతో స్మోక్ అలార‌మ్‌లూ మోగాయి. ఈ ఘ‌ట‌న స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న ర‌ష్యా మాడ్యూల్‌లో జ‌రిగింది. కక్ష్యలో అవుట్‌పోస్టుకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పొగలు కమ్ముకున్నాయి. జ్వెజ్‌దా మ్యాడూల్‌లోనే ఆస్ట్రోనాట్లు నివ‌సించే క్వార్టర్లు ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో అంత‌రిక్ష కేంద్రంలో వ‌రుస‌గా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన హార్డ్‌వేర్, సిస్టమ్స్‌లో సమస్యలు తలెత్తడం కారణమని ఓ ర‌ష్యా అధికారి హెచ్చరించారు. ఆటోమేటిక్‌ బ్యాటరీ చార్జింగ్‌ అవుతున్న సమయంలో పొగను స్మోక్‌ డిటెక్టర్‌ గుర్తించడంతో అలారం మోగిందని నాసా వెల్లడించింది . సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బ్యాట‌రీల‌ను రీచార్జింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆస్ట్రోనాట్లు పొగ‌ను గుర్తించారు. వాళ్లు ప్లాస్టిక్ కాలిన వాస‌న‌ను గుర్తించి గుర్తించి అప్రమత్తం అయ్యారు. ఫిల్టర్‌ను ఆన్ చేసిన త‌ర్వాత అక్కడ‌ గాలి క్లీనైట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఫిక్స్ చేసిన స‌మ‌యం ప్రకార‌మే గురువారం స్పేస్‌వాక్ ఉంటుంద‌ని నాసా వెల్లడించింది. ఇటీవ‌లే స్పేస్ స్టేష‌న్‌కు నౌక సైన్స్ మాడ్యూల్‌ను ర‌ష్యా పంపించింది. ప్రస్తుతం దాన్ని ఇద్దరు కాస్మోనాట్స్ ఫిక్స్ చేస్తున్నారు.

1998లో అంతర్జాతీయ కేంద్రం నిర్మాణం:

కాగా, అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రాన్ని 1998లో నిర్మించారు. ర‌ష్యా, అమెరికా, కెన‌డా, జ‌పాన్‌తో పాటు యురోపియ‌న్ దేశాలు దీనిని చేప‌ట్టాయి. 15 ఏళ్ల జీవిత‌కాలంతో దీన్ని డిజైన్ చేశారు. రెండు నెల‌ల క్రితం త్రస్టర్లు ఆక‌స్మికంగా ఆన్‌కావ‌డంతో.. స్పేస్ స్టేష‌న్ కొంత ప‌క్కకు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

గతంలో..

కాగా, 2021 జూలైలో రష్యా పరిశోధన మాడ్యూల్‌ నౌకా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైన తర్వాత స్వల్ప కాలంలో నియంత్రణ కోల్పోయింది. సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. నౌకా త్రస్టర్లను ప్రణాళిక లేకుండా పేల్చడంతో 45 నిమిషాల పాటు నౌక గతి తప్పింది.

ఇవీ కూడా చదవండి:

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..