ట్రక్కులో 39 మృత దేహాలు.. . బయటపడిన దారుణ నిజాలు

ఇటీవల బ్రిటన్ (లండన్) లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం పోలీసులను షాక్ కి గురి చేసింది. ఆ ఘటనకు సంబంధించి సుమారు 25 ఏళ్ళ ఐర్లాండ్ యువకుడిని వారు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అతని వయస్సు పాతికేళ్ళు కాదని, 43 ఏళ్ళ వయసున్న ఆ వ్యక్తి… ఆ ట్రక్కు యజమాని అని తెలిసింది. మెల్లగా ఈ మృతదేహాల మిస్టరీ కూడా వీడుతోంది. ఆ డెడ్ బాడీల్లో ఆరింటిని […]

ట్రక్కులో 39 మృత దేహాలు.. . బయటపడిన దారుణ నిజాలు
Follow us

|

Updated on: Oct 26, 2019 | 5:30 PM

ఇటీవల బ్రిటన్ (లండన్) లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం పోలీసులను షాక్ కి గురి చేసింది. ఆ ఘటనకు సంబంధించి సుమారు 25 ఏళ్ళ ఐర్లాండ్ యువకుడిని వారు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అతని వయస్సు పాతికేళ్ళు కాదని, 43 ఏళ్ళ వయసున్న ఆ వ్యక్తి… ఆ ట్రక్కు యజమాని అని తెలిసింది. మెల్లగా ఈ మృతదేహాల మిస్టరీ కూడా వీడుతోంది. ఆ డెడ్ బాడీల్లో ఆరింటిని వియత్నాం కు చెందినవారివిగా గుర్తించారు. వీరిలో ఒకరైన 26 ఏళ్ళ ‘ ఫామ్ థీ ట్రా ‘ అనే యువతి విషాదాంతం వెల్లడైంది. మంచి ఉద్యోగం , మెరుగైన జీవితం కోసం బ్రిటన్ వెళ్లే ప్రయత్నంలో ఆమె మొదట చైనాకు, ఆ తరువాత ఫ్రాన్స్ కు ప్రయాణించింది. అయితే బ్రిటన్ వెళ్ళడానికి ఆమె ఏజెంట్లకు (స్మగ్లర్లకు) 30 వేల పౌండ్లు చెల్లించిందట. కానీ ఈ ప్రయాణం మధ్యలో ఏమైందో ఏమోగానీ.. ఈమె అపస్మారక స్థితిలో ఈ వాహనంలో చేరింది. తాను శ్వాస తీసుకోలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని ఈమె తన తల్లికి పంపిన టెక్స్ట్ మెసేజుల్లో పేర్కొంది. ఈ యువతి మాదిరే 20 ఏళ్ళ ‘ దిన్ లాంగ్ ‘ అనే యువకుడు కూడా మనుషులను అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల బారిన పడ్డాడు. బ్రిటన్ లో ఇంత ఘోరమైన నేరం (39మంది హత్య) బయటపడడం ఇదే మొదటిసారని అంటున్నారు. బాధితులకు మాయ మాటలు చెప్పి.. వారిని అంతమొందించి.. గుట్టు చప్పుడు కాకుండా వారి మృతదేహాలను నగర శివారుల్లో పూడ్చి పెట్టేందుకే క్రిమినల్స్ ఈ ట్రక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ట్రక్కు యజమాని భార్య కూడా ఉంది.