Semen Terrorism: ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పబోయే విషయం కొత్తదిగా కనిపించవచ్చు. మామూలుగా మన సంస్కృతిని బట్టి చూస్తే కొంత అసహ్యకరమైన విషయం చెబుతున్నట్టు అనిపించవచ్చు. కానీ, మహిళలపై వేధింపులలో ఇదో కొత్త కోణం. మహిళలను వేధించడం కొందరికి చాలా సరదా. మహిళలు రకరకాల వేధింపులకు గురి అవుతున్న సంఘటనలు ఎన్నో ఇప్పటివరకూ మనం చూస్తూ వచ్చాం. మన దేశంలో మహిళలను రకరకాల పద్ధతుల్లో వేధించడంపై వార్తలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ మహిళలపై వేధింపులను గురించిన సరైన వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురైన కేసు వెలుగులోకి వస్తే.. అప్పుడు ఆ వేధించిన విధానాన్ని బట్టి కేసు తీవ్రత అంచనా వేయడం.. దాని ప్రకారం శిక్షలు విధించడం జరుగుతూ వస్తోంది.
ఒక్కో కేసులో మహిళ ఇష్టం లేకుండా తాకినా నేరమే అనే తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఒక కేసు విషయంలో మహిళను తాకితే అది వేధింపు కిందకు రాదని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతు ఉండదు. ఇది మనదేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈమధ్యకాలంలో దక్షిణ కొరియాలో మహిళలపై కొత్త తరహా వేధింపులు ఎక్కువ అయిపోయాయి. దీనిని అక్కడి సోషల్ మీడియాలో “సెమెన్ టెర్రరిజం” అని పిలుస్తున్నారు.
అక్కడ మహిళలను ఇలా వేధిస్తున్నారు. మహిళలకు చెందిన వస్తువులపై వీర్యాన్ని స్కలిస్తున్నారు దుండగులు. తద్వారా వారిని మానసికంగా వేధిస్తున్నారు. అయితే, ఈ వేధింపులు చట్టపరంగా మహిళా వేధింపుల పరిధిలోకి రావడం లేదు. ఇటువంటి విషయాలపై కేసులు నమోదు అయినా..అవి ఆస్తి నష్టం కేసులుగా పరిగణించి చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టేస్తున్నారు. ఎందుకంటే, ఈ తరహా వేధింపులు ఎక్కడా మహిళా వేధింపుల చట్టంలో పేర్కొని లేవు. ఇదే అదనుగా తమకు ఎవరిపైనా కోపం ఉంటే.. ఆ మహిళకు చెందిన వస్తువులు.. బట్టలు వంటి వాటిపై వీర్యాన్ని స్ఖలించి వేధిస్తున్నారు ఆకతాయిలు.
దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఈ ”సుమన్ టెర్రరిజం” కేసులలో ముఖ్యమైనవి కొన్ని ఇవీ..
మహిళల వ్యక్తిగత వస్తువులపై, లోపల రహస్యంగా పురుషులు స్ఖలనం చేసిన అనేక ఉన్నత స్థాయి సంఘటనల తర్వాత లైంగిక నేరంగా పరిగణించబడే పరిధిని విస్తరించాలని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.