రూ.50కోట్లతో 90ఏళ్ల నాటి ఇంటికి మరమ్మతులు.. తవ్వకాల్లో బయటపడ్డ రహస్య గది, సీక్రెట్‌ లాకర్‌..!

|

Feb 10, 2023 | 6:14 PM

గృహ పునరుద్ధరణ సమయంలో ఇటువంటి రహస్య లాకర్లు సర్వసాధారణంగా చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. చాలా మంది ఇటువంటి రహస్య గదుల నుండి లక్షల విలువైన కళాఖండాలు, పెయింటింగ్‌లు, నగదు, విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రూ.50కోట్లతో 90ఏళ్ల నాటి ఇంటికి మరమ్మతులు.. తవ్వకాల్లో బయటపడ్డ రహస్య గది, సీక్రెట్‌ లాకర్‌..!
Secret Underground Chamber
Follow us on

90ఏళ్ల నాటి ఒక పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా, ఊహించని దృశ్యం కనిపించింది. ఆ ఇంటి అంతర్భాగంలో తవ్వుతుండగా ఓ రహస్య గది బయటపడింది. ఆ గదికి గట్టి బందోబస్తుతో తాళం వేసి ఉండటం కనిపించింది. ఈ సంఘటన USAలోని లాస్ ఏంజిల్స్‌లో వెలుగు చూసింది. లాస్ ఏంజిల్స్‌ని హాన్‌కాక్ పార్క్‌లో $6 మిలియన్ల (దాదాపు రూ. 50 కోట్లు) ఇంటిని పునరుద్ధరించే సమయంలో భూగర్భంలో తెరుచుకునే రహస్య గది బయటపడింది. 90 ఏళ్ల నాటి ఇంటి అంతస్తులో రహస్య గది తలుపు కనిపించింది. ఇంటి పునర్నిర్మాణ సమయంలో భూగర్భంలోకి వెళ్లే రహస్య ద్వారం కనిపించింది. ఆ తలుపు అంత ఈజీగా తెరుచుకోలేదు. ఇది ప్రత్యేకంగా నంబర్ డయల్‌తో రహస్య లాక్‌తో సురక్షితం తయారు చేయబడింది.

అయితే, సీక్రెట్ చాంబర్ తలుపు పూర్తిగా దుమ్ము,ధూళితో పాడుబడిపోయింది. భవన శిథిలాలతో నిండిపోయని దృశ్యాలను చూసిన ఆ ఇంటి యజమాని అదంతా ఫోటోలు, వీడియోలు తీశాడు. సోషల్ మీడియా సైట్ రెడ్డిట్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. దాదాపు 3500 మంది ఈ ఫోటోపై కామెంట్ చేశారు. వేలాది మంది ఈ చిత్రాన్ని షేర్ చేశారు. యజమాని చిత్రంతో పాటు మరికొంత సమాచారాన్ని కూడా పంచుకున్నారు. అదేంటంటే..

ఇంటి పునర్నిర్మాణం 2020లో ప్రారంభమైంది. పనులు పూర్తి కావడానికి మరో నాలుగేళ్లు పట్టవచ్చు. ఇక్కడ నిర్మాణాలన్నీ అస్తవ్యస్థంగానే ఉన్నాయని చెప్పాడు. ఇంటి కింద రెండు గదులు ఉన్నాయని చెప్పాడు. లాక్స్మిత్ అనే ఖాతాదారుడు కొంత సమాచారాన్ని నమోదు చేశాడు. అవి భూగర్భ అగ్నిమాపక గదులుగా ఉండే అవకాశం ఉందన్నారు. చాలా మటుకు ఇది ఆస్బెస్టాస్‌తో తయారు చేయబడిందని. ఇదే ఆ సమయంలో సురక్షితమైనదిగా పరిగణించబడింది. . సురక్షితమైన ఆస్బెస్టాస్ పేర్చడానికి 99 శాతం అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే దాన్ని తెరిచి తనిఖీ చేయండి అంటూ కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఐరోపా, USలో గృహ పునరుద్ధరణ సమయంలో ఇటువంటి రహస్య లాకర్లు సర్వసాధారణంగా చెబుతున్నారు. చాలా మంది ఇటువంటి రహస్య గదుల నుండి లక్షల విలువైన కళాఖండాలు, పెయింటింగ్‌లు, నగదు, విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..