Aliens Humans: భూమి మీద గ్రహాంతరవాసుల లైంగిక దాడి.. బాధితుల్లో ఒకరు గర్భవతి.. పెంటగాన్ సంచలన నివేదిక

|

Apr 08, 2022 | 12:06 PM

Aliens and Humans: విశ్వం అనేక వింతలు విశేషాలు రహస్యాలతో నిండివుంది. ముఖ్యంగా గ్రహాంతరవాసులు ఉన్నాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఏలియన్స్ సంచారం పై శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో..

Aliens Humans: భూమి మీద గ్రహాంతరవాసుల లైంగిక దాడి.. బాధితుల్లో ఒకరు గర్భవతి.. పెంటగాన్ సంచలన నివేదిక
Secret Pentagon Documents
Follow us on

Aliens Humans: విశ్వం అనేక వింతలు విశేషాలు రహస్యాలతో నిండివుంది. ముఖ్యంగా గ్రహాంతరవాసులు ఉన్నాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఏలియన్స్ సంచారం పై శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇతర గ్రహాల్లో జీవించేవారిని కనుగొండడానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. దీంతో గ్రహాంతర వాసులు ఉన్నారా? అనే చాలా కాలంగా చర్చనీయాంశమైన ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే భూమిని గ్రహాంతర వాసులు సందర్సించారంటూ ది సన్(The Sun) అనే దినపత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి సేకరించిన పత్రాల ద్వారా గ్రహాంతర వాసులు ఉనికిని ఉన్నట్లు ధృవీకరించింది ది సన్ పత్రిక. ఈ పత్రాల ప్రకారం.. చాలా సార్లు భూమిని గ్రహాంతర వాసులు సందర్శించారని.. UFOలు (గ్రహాంతరవాసుల వాహనం) వలన చాలామంది గాయ పడ్డారని అమెరికాకు(America) చెందిన పెంటాగన్ డాక్యుమెంట్లు (Pentagon Documents) పేర్కొన్నాయి. అంతేకాదు కొన్ని ఏలియన్స్ వలన మహిళలపై ఏలియన్స్ లైంగిక దాడి చేశారని.. ఓ మహిళ గర్భం కూడా దాల్చిందంటూ పేర్కొంది.

‘ది సన్’ అనే దినపత్రిక ఇటీవల అమెరికా నుంచి ఈ పత్రాలను సేకరించింది. సమాచార హక్కు చట్టం కింద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) స్వయంగా ఈ డాక్యుమెంట్లను ఇచ్చింది. నాలుగు సంవత్సరాల తర్వాత, DIA ఈ కార్యక్రమానికి సంబంధించి 1,500 పత్రాలను పెంటగాన్‌కు అందజేసింది. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు ఉన్నాయి.

గోప్యతా సమస్యల కారణంగా ఈ పత్రాలలోని కొన్ని భాగాలను ప్రచురించదానికి అనుమతిలేదని DIA తెలిపింది. అయితే  నివేదికల ప్రకారం.. ఈ రోజు వరకు గ్రహాంతర వాసులు, మానవులమీద ఐదుసార్లు లైంగిక దాడి చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వలన అనేక ఇతర వినాశకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది.  రేడియేషన్ కాలిన గాయాలు, మెదడు సమస్యలు , నరాలు పరిణామాల్లో తేడాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఇక  UFOలను ప్రత్యక్షంగా చూసిన వారు గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు.

మెడికల్ డేటాను కూడా సేకరించాం. వీటిల్లో కొన్ని విచిత్రమైన ఘటనల వలన మానవులు గాయపడినట్లుగా మెడికల్ ఫైల్‌లో 42 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

AATIP 2007 – 2012 మధ్య పెంటగాన్ ఒక రహస్య  పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో UFOలను గుర్తించడంపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ ఇంటెలిజెన్స్ అధికారి లూయిస్ ఎలిజోండో నాయకత్వం వహించారు. ఒక ఇంటర్వ్యూలో లూయిస్..  ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ..  UFOలతో సంబంధం ఉన్న వారికి రేడియేషన్ సోకుతుందని చెప్పారు. అంతేకాదు 2004లో అమెరికా నావికా దళం సముద్రంలో రిహార్సల్స్ చేస్తున్న సమయంలో..  ఒక UFO ప్రత్యక్షమైందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

Also Read: Crotalaria Cunninghami: ఆకుపచ్చ హమ్మింగ్‌బర్డ్‌లా కనిపించే పువ్వులు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. వీటిని ఔషదంగా ఉపయోగించే ఆదివాసీలు