అమెరికాలో హిందూ వ్యతిరేక విద్వేషం.. దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!

అమెరికాలో దీపావళి వేడుకల సందర్భంగా జాతి విద్వేష ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన అతివాద కార్యకర్త జేక్ లాంగ్ ప్రయత్నించాడు. అతడితో పాటు వచ్చిన నిరసనకారులు హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అభ్యంతరకరమైన నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఘటన అమెరికాలోని భారతీయ అమెరికన్లు, హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

అమెరికాలో హిందూ వ్యతిరేక విద్వేషం.. దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
Diwali Festival Disrupted

Updated on: Nov 08, 2026 | 10:42 AM

అమెరికాలో దీపావళి వేడుకల సందర్భంగా జాతి విద్వేష ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన అతివాద కార్యకర్త జేక్ లాంగ్ ప్రయత్నించాడు. అతడితో పాటు వచ్చిన నిరసనకారులు హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అభ్యంతరకరమైన నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఘటన అమెరికాలోని భారతీయ అమెరికన్లు, హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

వేడుకల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం..!

నవంబర్ 7న స్థానిక కాలమానం ప్రకారం సియాటిల్‌లోని సియాటిల్ సెంటర్ ఆర్మరీలో ‘దీపావళి: లైట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు జేక్ లాంగ్ తన అనుచరులతో కలిసి చేరుకున్నాడు. వారి చేతుల్లో ‘డిపోర్ట్ ఆల్ డాట్ హెడ్స్’ (డాట్ హెడ్స్ అందరినీ దేశం నుంచి బహిష్కరించండి) అనే జాతి విద్వేషపూరిత నినాదాలు ఉన్న ప్లకార్డులు కనిపించాయి. అయితే, అక్కడున్న కొందరు వేడుకల నిర్వాహకులు, పాల్గొన్నవారు వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

సోషల్ మీడియాలో హిందువులపై విషం..

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను జేక్ లాంగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తమపై యాంటీఫా కార్యకర్తలు, హిందువులు దాడి చేశారంటూ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా హిందూ సమాజంపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. టెక్సాస్ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలగడానికి హిందువులే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందువులను ఉద్దేశించి అవమానకరమైన భాషను ఉపయోగించాడు.

క్యాపిటల్ దాడిలోనూ కీలక ఆరోపణలు..!

జేక్ లాంగ్‌కు గతంలోనూ వివాదాస్పద చరిత్ర ఉంది. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో పోలీసులపై హింసకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. సుమారు నాలుగేళ్లపాటు జైలులో ఉన్న అతడిని 2025 జనవరి 20న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ద్వారా విడుదల చేశారు. ఇప్పటికి అతడు విచారణ ఎదురుచూస్తున్న ఖైదీగా ఉన్నాడు.

మరో ఆలయంపై దాడి కుట్ర కలకలం..!

ఇదిలా ఉండగా, చికాగో సమీపంలోని హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపౌరాకిస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వరుసగా వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు అమెరికాలో హిందూ సమాజ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిచ్చే అమెరికాలో ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us