Russia: అమెరికాపై అలిగిన రష్యా! ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

|

Jul 27, 2022 | 2:24 PM

ఇంటర్నేషన్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు రష్యా మంగళవారం (జులై 26) ప్రకటించింది..

Russia: అమెరికాపై అలిగిన రష్యా! ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..
Putin Yury Borisov
Follow us on

Russia to quit the International Space Station after 2024: ఇంటర్నేషనల్ స్పేస్‌ స్టేషన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు రష్యా మంగళవారం (జులై 26) ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ రోజు మస్కోలోనున్న క్రెమ్లిన్‌లో రష్య స్పేస్‌ ఏజెన్సీ రోస్కోస్మోస్ కొత్త చీఫ్ యూవీ బోరిసోవ్‌ను కలిశారు. వీరి సమావేశం అనంతరం పుతిన్‌ తాజా ప్రకటన వెలువరించారు. 2024 తర్వాత ఇంటర్నేషన్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు మాస్కో స్పేస్‌ ఏజెన్సీ కొత్త చీఫ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం జరుపుతున్న నేపధ్యంలో అమెరికా సైనిక జోక్యం, ఆంక్షలు విధించడాన్ని రోస్కోస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తప్పుబట్టాడు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా 1998 నుంచి ఐఎస్‌ఎస్‌ నిర్ధేశిత కక్ష్యలో తిరిగేందుకు అవసరమైన ప్రొపెల్షన్‌ సిస్టంను అందించేందుకు రష్యా, అమెరికాతో కలిసి పనిచేస్తోంది. 2024 వరకు స్పేస్‌ స్టేషన్‌తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని బోరిసోవ్ స్పష్టం చేశారు. అప్పటికి రష్యన్ ఆర్బిటల్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని బోరిసోవ్ అన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నావిగేషన్‌, కమ్యూనికేషన్‌, డేటా ట్రాన్స్‌మిషన్‌ వంటి అన్ని స్పేస్‌ సేవలను అందించేందుకు సాయశక్తుల కృషి చేస్తామని బోరిసోవ్ అన్నారు.

1961లో అంతరిక్షంలో మొట్టమొదటి సారిగా మానవుడు ప్రవేశించడం దగ్గరి నుంచి నాలుగేళ్ల క్రితం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం వరకు అనేక విజయాలు రష్యా ఖాతాలో ఉన్నాయి. ఐతే తాజా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కాలంలో అవినీతి, కుంభకోణాలు, ఎన్నో శాటిలైట్లు, స్పేస్‌ క్రాఫ్ట్‌లను కోల్పోవడం వంటి వరుస వైఫల్యాలతో రష్యా అప్రతిష్ట మూటగట్టుకుందని, అందుకే మెల్లగా జరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి