క్రెమ్లిన్ రూల్ పై పోటెత్తిన నిరసన, మాస్కోలో వేలాది మంది ప్రదర్శన, విపక్ష నేత నావెల్నీ విడుదలకు డిమాండ్

క్రెమ్లిన్ రూల్ ని ఖండిస్తూ శనివారం మాస్కోలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. దేశవ్యాప్తంగా 2,500 మందిని పోలీసులు..

  • Umakanth Rao
  • Publish Date - 12:55 pm, Sun, 24 January 21
క్రెమ్లిన్ రూల్ పై పోటెత్తిన నిరసన, మాస్కోలో వేలాది మంది ప్రదర్శన, విపక్ష నేత నావెల్నీ విడుదలకు డిమాండ్

క్రెమ్లిన్ రూల్ ని ఖండిస్తూ శనివారం మాస్కోలో వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. దేశవ్యాప్తంగా 2,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిపక్ష నేత అలెక్సి నావెల్నీ ని విడుదల చేయాలని కూడా నిరసనకారులు నినాదాలు చేశారు. జర్మనీ నుంచి నావేల్నీ మాస్కో విమానాశ్రయానికి చేరగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. లోగడ ఓ ఏజంట్ ఇఛ్చిన విషపూరిత కాఫీ తాగి నావేల్నీ తీవ్ర అస్వస్థుడయ్యాడు. జర్మనీలో చికిత్స పొంది వచ్చారు. మాస్కో ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు వెంటనే అత్యంత భద్రతతో కూడిన జైలుకు తరలించారు. గతంలో మాదిరి కాక, ఈ సారి దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో ప్రొటెస్టులు జరిగాయి. ముఖ్యంగా మాస్కోలో ప్రదర్శనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. నావెల్సీ ని ఉంచిన జైలు వద్ద కూడా ప్రొటెస్టర్లు వారిపై తలపడ్డారు. అధ్యక్షుడు  పుతిన్ పాలనకు చరమాంకం పలకాలని, పూర్తిగా విసుగెత్తిపోయామని వారు . అన్నారు. నావేల్నీ అరెస్టును  అమెరికా సహా పలు దేశాలు ఖండించాయి.  ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరాయి.