రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిప్పులు కక్కారు. ఆయనను ఓ ‘కిల్లర్’ గా అభివర్ణించారు. తన పనులకు పుతిన్ మూల్యం చెల్లించుకుంటాడని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈవిధమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి పుతిన్ పరోక్షంగా యత్నించాడని ఆయన పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రమోట్ చేయడానికి పుతిన్ ప్రయత్నించారని యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్టులో వచ్చిన సమాచారాన్ని బైడెన్ దృష్టికి తేగా.. ఆయన ఇలా స్పందించారు. పైగా ప్రతిపక్ష నేత అలెక్సీ నావేల్నీని, విష ప్రయోగంతో చంపడానికి కూడా పుతిన్ యత్నించారా అన్న ప్రశ్నకు కూడా బైడెన్ ఉండవచ్చునని సమాధానమిచ్చారు. నావెల్నీపై విష ప్రయోగం కారణంగా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించే విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు అమెరికా వాణిజ్య శాఖ ఇటీవల ప్రకటించింది. జొబైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలోని తమ దేశ రాయబారిని రష్యా వెనక్కి పిలిపిస్తోంది. అలాగే మాస్కో లోని తమ రాయబారిని కూడా అమెరికా పిలిపిస్తుందా అన్న విషయం ఇంకా తెలియలేదు. అమెరికాతో సంబంధాలపై ఎలాంటి చరియలు తీసుకోవాలా అని రష్యా తమ రాయబారితో సంప్రదించనుంది. అమెరికా ఇలాగె ప్రవర్తిస్తే ఆ దేశంతో తమ సంబంధాల విషయాన్నీ తాము సమీక్షించాల్సి ఉంటుందని రష్యన్ డెప్యూటీ విదేశాంగ మంత్రి సెర్జీ ర్యబకోవ్ హెచ్చరించారు.
జొబైడెన్ రష్యా పట్ల ఇక కఠినంగా వ్యవహరించనున్నారా అన్న ప్రశ్నకు వైట్ హౌస్ లోని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి.. ఇందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. నావెల్నీపై విషప్రయోగం, సైబర్ దాడులు, ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా దళాలపై ఎటాక్స్ వంటి వాటిని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా రష్యా అధ్యక్షునిపై లోగడ ట్రంప్ ఒక్కసారిగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. పుతిన్ ని ఆయన దాదాపు తన మిత్రునిగా ప్రకటించుకున్నారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video
ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.