Britian PM Race: బ్రిటన్ పదవి రేసులో రిషి సునాక్ ముందంజ.. తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్..

రిషి సునాక్‌ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఆయన యూకే ప్రధాని కావడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్​ జాన్సన్​తప్పుకోవడం..

Britian PM Race: బ్రిటన్ పదవి రేసులో రిషి సునాక్ ముందంజ.. తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్..
Rishi Sunak And Boris Johnson

Updated on: Oct 24, 2022 | 10:43 AM

రన్నరప్‌ ఇప్పుడు ఫ్రంట్‌ రన్నర్ అయ్యారు. అవునండీ.. రెండు నెలల క్రితం ప్రధాని పదవి కోసం రిజ్‌ ట్రస్‌తో పోటీపడినా అధికార పీఠాన్ని చేరుకోలేకపోయిన రిషి సునాక్‌ ఇప్పుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఆయన యూకే ప్రధాని కావడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్​జాన్సన్​ తప్పుకోవడం.. ఇప్పటికే రిషికి 142 మందికిపైగా ఎంపీల మద్దతు ఉండడంతో ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయ్యే ఛాన్సలు ఫుల్‌గా కనిపిస్తున్నాయి.

భారత సంతతికి చెందిన రిషి సునక్‌కి, మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్‌ మధ్య ఇప్పుడు పోటీ ఉండే ఛాన్స్‌ కనిపిస్తోంది. అయితే.. పెన్నీ మోర్డాంట్‌కి ఎంత మంది సపోర్ట్ ఉందనే దానిపై కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతే పోటీ అనివార్యం అవుతుందా.. రిషి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా అనేది తెలుస్తుంది. ఎవరూ పోటీలో లేకపోతే.. సునాక్‌ సోమవారం సాయంత్రంలోగా టోరీ నాయకుడిగా.. ప్రధానమంత్రిగా ప్రకటించనున్నారు. ఒకవేళ బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు అభ్యర్థులు ఉంటే మరోసారి ఆన్‌లైన్ ఓటు ద్వారా లిజ్ ట్రస్ వారసుడిని శుక్రవారం ప్రకటించనున్నారు.

మాజీ ప్రధాని బోరిస్​జాన్సన్​ కూడా రేసులో ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చినా.. ఆఖర్లో ఆయన నిర్ణయం మార్చుకున్నారు. తనకు కూడా పార్టీలో సపోర్ట్‌ బాగానే ఉందని చెప్పుకొచ్చిన ఆయన.. మరోసారి పీఎంగా ఉండడం సరికాదనే వెనక్కి తగ్గినట్టు వివరించారు. పార్టీలో యూనిటీ ఉండాలని చెప్పుకొచ్చారు. కాగా, బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవి చేపట్టిన ఆరు వారాల్లోనే..ఆమె విధానాలపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రస్‌ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దివాలా తీసింది. మినీ బడ్జెట్‌లో సంపన్నులకు పన్ను కోతలు విధించడంపై వ్యతిరేకత రావడం..ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం..ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తొలగించడం వంటి పరిణామాలతో లిజ్‌ ట్రస్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.