AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలాండ్‌లో వీధికెక్కిన రోబోలు .. ఏఐ పై తిరుగుబాటు ధర్నా!

పోలాండ్‌ రాజధాని వార్సాలో రచ్చ జరిగింది. ఏకంగా 30 రోబోలు రోడ్డెక్కి నిరసన చేపట్టాయి. "మా వల్ల మనుషుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, AIని కంట్రోల్ చేయండి" అంటూ డిజిటల్ మంత్రిత్వశాఖ ముందు బైఠాయించాయి. జెండాలు పట్టుకుని, రౌండ్లు వేస్తూ లౌడ్‌స్పీకర్లతో నానా హంగామా చేశాయి. "జాబ్స్ కాపాడండి", "రూల్స్ తీసుకురండి" అంటూ గొంతు చించుకున్నాయి.  'డెమోక్రాటిజం' అనే ఎన్జీవో ఈ  నిరసన ప్లాన్ వేసింది.

పోలాండ్‌లో వీధికెక్కిన రోబోలు .. ఏఐ పై తిరుగుబాటు ధర్నా!
Robots Have Started Protesting Want Ai Regulation
Sharada V
|

Updated on: Sep 09, 2026 | 5:54 PM

Share

ఇందులో ‘అగిబోట్ ఏ3’ (Agibot A3) అనే హ్యూమనాయిడ్ రోబో కూడా పాల్గొంది. “ఇది జరిగి తీరుతుంది. ఇది ఇకపై సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, రియాలిటీ భయ్యా!” అని ఏకంగా మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసింది. రెండు కాళ్ల మనుషుల ఆకారంలో రోబోల నుంచి, కుక్కల లాంటి ఫోర్-లెగ్డ్ రోబోల వరకు  ఈ ప్రదర్శనలో రచ్చ రచ్చ చేశాయి. అసలే జాబ్ మార్కెట్ లో AI టెన్షన్ ఉంటే, ఇప్పుడు రోబోలే వచ్చి “మా వల్ల ప్రాబ్లమ్ అవుతుంది” అనడం ట్రెండింగ్ టాపిక్ అయింది!

రోబోలే రోడ్డెక్కి ధర్నా చేయడం నెక్స్ట్ లెవెల్ క్రేజ్

టెక్నాలజీ మరీ ఇంత వేగంగా స్పీడ్ పెంచేస్తే ఎలా? రేపు పొద్దున మనుషుల జాబ్స్ పరిస్థితి ఏంటి అని ఆలోచించి, ఏకంగా రోబోలే రోడ్డెక్కి ధర్నా చేయడం నెక్స్ట్ లెవెల్ క్రేజ్.   సినిమాల్లో టెర్మినేటర్ వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయడం చూశాం, కానీ రియల్ లైఫ్‌లో  రోబోలు వచ్చి “మా వల్ల హ్యూమన్స్ కష్టపడుతున్నారు” అని చెప్పడం చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. అవన్నీ కేవలం ఫ్యాక్టరీల్లో పనిచేసే యంత్రాలు కావు, రేపు మన జాబ్ డెస్క్ మీద కూర్చునే రకాలు.

“ఏఐ (AI) మన ఉద్యోగాలను లాగేసుకుంటుంది” అని మనుషులు భయపడటం కామన్. కానీ స్వయంగా ఆ టెక్నాలజీయే రంగంలోకి దిగి “దీనికో రూల్ పెట్టండి బాసు” అని గవర్నమెంట్‌ను అడగడం మాత్రం హిస్టారికల్ మొమెంట్. కేవలం గిమ్మిక్ లాగా కాకుండా, దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. భవిష్యత్తులో ఆటోమేషన్ వల్ల నిరుద్యోగం ఎంత పెరిగిపోతుందో ముందే కళ్లకు కట్టినట్టు చూపించడమే ఈ ‘డెమోక్రాటిజం’ సంస్థ ఉద్దేశం.

ఎందుకు ఈ ప్రొటెస్ట్?

‘డెమోక్రాటిజం’ అనే ఆర్గనైజేషన్ ఈ  నిరసన ప్లాన్ చేసింది. ఫ్యూచర్‌లో ఫిజికల్ వర్క్ చేసేవే కాకుండా, ఆలోచించే AI సిస్టమ్స్ కూడా మనుషుల ఉద్యోగాలను ఎలా పీకేస్తాయో కళ్లకు కట్టినట్టు చూపించడమే వీళ్ల మెయిన్ ఉద్దేశం. “జాబ్స్ కాపాడండి, రూల్స్ తీసుకురండి” అంటూ ఏకంగా టెక్నాలజీ చేతే టెక్నాలజీపై గొంతు విప్పించడం ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా ట్రెండింగ్ టాపిక్ అయింది!

ఏఐ రేసుతో మానవాళికి ముప్పు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ లాంటి పెద్ద కంపెనీల మధ్య వార్ నడుస్తోందనీ దీంతో మానవాళికి  ప్రమాదం ఉందనీ ఏఐ పరిశోధకుడు జాకబ్ కోక్సన్  గట్టి వార్నింగ్ ఇచ్చాడు.  ఈ కంపెనీల మధ్య నడుస్తున్న పోటీ మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అందుకే జాబ్‌ రిజైన్ చేసానని జాకబ్ తెలిపాడు. నియంత్రణ లేని ఏఐ డెవలప్‌మెంట్ ఫ్యూచర్‌లో ..ఎండ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రేస్‌కి  దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసాడు. టెక్నాలజీ మన ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు ఇప్పుడు గట్టిగానే నిజమవుతున్నాయి

Jacob Coxon Resigns From Anthropic

Jacob Coxon Resigns From Anthropic

మూడేళ్లు ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్‌లో జాక‌బ్ ప‌నిచేశాడు. త‌న కంపెనీ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని, సూప‌ర్ ఇంటెలిజెన్స్ కోసం ప‌రుగులు తీస్తూ ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయనీ అన్నాడు. త్వరలో రాబోయే ఏఐ సిస్టమ్స్ నార్మల్ గా ఉండవని, అవి దేన్నైనా ఈజీగా హ్యాక్ చేస్తాయని, రాత్రికి రాత్రి ఏ ఇండస్ట్రీనైనా సర్వనాశనం చేసే రియల్ పవర్స్ వాటికి వస్తాయని వార్నింగ్ ఇచ్చాడు. ఏఐ పవర్‌ని ఎవరూ లైట్ తీసుకోవద్దని, ఇది ఫ్యూచర్‌లో ఊహించని డిజాస్టర్‌కి దారితీస్తుందని హెచ్చరించాడు. <

h3 data-path-to-node=”2,1,0″>టెక్నాలజీ కంట్రోల్ తప్పుతుందనే భయాలు

కొద్ది రోజుల క్రితం యూఎన్ రైట్స్ చీఫ్ వోల్కర్ టర్క్ (Volker Türk) కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఉందని హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే, జాకబ్ కూడా అదే రేంజ్‌లో వార్నింగ్ ఇవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.  మెటా, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, గూగుల్ మధ్య నడుస్తున్న నంబర్ వన్ పోటీలో  సేఫ్టీని పక్కన పెట్టి మరీ డేంజర్ జోన్‌లోకి వెళుతున్నాయి.  ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీ కంట్రోల్ తప్పుతుందనే భయాలు వణుకు పుట్టిస్తున్నాయి!

Follow Us