నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషల్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. నేపాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఉప ప్రధానితో సహా పది మంది మంత్రులు కూడా ఇప్పటివరకు రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా చేస్తే.. మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా
Nepal Prime Minister Kp Sharma Oli

Updated on: Sep 09, 2025 | 4:00 PM

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషల్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. నేపాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఉప ప్రధానితో సహా పది మంది మంత్రులు కూడా ఇప్పటివరకు రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా చేస్తే.. మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది.

మరోవైపు ఐదు డిమాండ్లతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. అనేక నగరాల్లో భారీ హింస చెలరేగింది. ఇదిలావుంటే ప్రధాని ఓలి చికిత్స కోసం దుబాయ్ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో, అతని ఆస్తి, విదేశీ పెట్టుబడుల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఓలికి నేపాల్‌లో 60 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని, అలాగే స్విస్ బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని తెలుస్తోంది.

73 ఏళ్ల కె.పి.శర్మ ఓలి నేపాల్ ప్రధానమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. తొలిసారిగా ఆయన ఈ పదవిని అక్టోబర్ 2015 నుండి ఆగస్టు 2016 వరకు నిర్వహించారు. రెండోసారి ఆయన ఫిబ్రవరి 2018లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మే 2021 వరకు ఆ పదవిలో కొనసాగారు. జూలై 2024లో ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. నేడు, అంటే సెప్టెంబర్ 9న ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. రాజకీయ అస్థిరత మధ్య, ఓలి చికిత్స కోసం దుబాయ్ వెళ్లాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో కొనసాగుతున్న హింస, నిరసనల కారణంగా, ఆయన ఆరోగ్యం, భద్రత గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..