Work From Home: సమయం దాటినా పని చేయమంటే.. జరిమానా కట్టాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన పోర్చుగీస్..

|

Nov 11, 2021 | 7:51 PM

ఉద్యోగులకు ఉపశమనం పొందేలా పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త కార్మిక చట్టాన్ని ఆమోదించింది. పోర్చుగల్ సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది....

Work From Home: సమయం దాటినా పని చేయమంటే.. జరిమానా కట్టాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన పోర్చుగీస్..
Act
Follow us on

ఉద్యోగులకు ఉపశమనం పొందేలా పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త కార్మిక చట్టాన్ని ఆమోదించింది. పోర్చుగల్ సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పనివేళల దాటిన తర్వాత ఉద్యోగులను సంప్రదించినట్లయితే యజమానులకు జరిమానా విధించవచ్చు. వర్క్ ఫ్రమ్ హెం చేసినా సమయం దాటిన తర్వాత పని చేయించుకోకూడదు. ఇంటి నుంచి పని చేయడం వల్ల విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ విద్యుత్ బిల్లు కూడా యజమానులో కట్టాలని చట్టంలో ఉంది.

ఈ చట్టం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంట్లో పర్యవేక్షించకుండా నిషేధించే నియమాలు అమలు చేయబడతాయని పోర్చుగల్ కార్మిక, సామాజిక భద్రత మంత్రి అనా మెండెస్ గోడిన్హో అన్నారు. కార్మికులు ఐసోలేషన్‌ను ప్రభావం పడకుండా ప్రతి రెండు నెలలకు వారి సూపర్‌వైజర్‌ను కలవాలని కోరుతున్నారని చెప్పారు. మెరుగైన పని-జీవిత సమతుల్యతను నెలకొల్పడానికి ఈ చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. పది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇండియాలో కూడా కార్మిక చట్టాలు ఉన్నాయి.

Read Also.. Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!

Russian President: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు..వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఛాన్స్

Double Decker Bus: ఇల్లు కొనలేక బస్సునే ఇల్లుగా మార్చుకున్న మోడల్‌.. అధునిక వసతులతో అందంగా అలంకరించిన వైనం..

Afghanistan: తెరపైకి తాలిబన్ల పిచ్చి రూల్‌.. భయాందోళనలో ప్రజలు !! వీడియో