Plane Lands On River: రన్‌వేపై దిగాల్సిన విమానం నదిపై ల్యాండ్ అయింది.. ఎక్కడంటే..?

|

Dec 31, 2023 | 8:43 PM

ఎయిర్‌లైన్స్ విమానం గురువారం తెల్లవారుజామున నదిపై ల్యాండ్ అయింది. విశేషం ఏమిటంటే చలి కారణంగా ఈ నది పూర్తిగా గడ్డకట్టింది. ఈ విమానంలో 30 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విమానానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Plane Lands On River: రన్‌వేపై దిగాల్సిన విమానం నదిపై ల్యాండ్ అయింది.. ఎక్కడంటే..?
Plane Lands On Frozen River
Follow us on

సాంకేతిక సమస్యలు, పైలట్ తప్పిదాల కారణంగా తరచుగా విమాన ప్రమాదాలు సంభవిస్తాయి. పొరపాటున పైలట్ విమానాన్ని నివాస ప్రాంతంలో లేదా రోడ్డుపై ల్యాండ్ చేయడం చాలా సార్లు చూస్తుంటాం.. అయితే తాజాగా రష్యా నుంచి వెలుగులోకి వచ్చిన ఉదంతం భయానకంగా ఉంది. పైలట్ చేసిన చిన్న తప్పిదం కారణంగా పోలార్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం తెల్లవారుజామున కొలిమా నదిపై ల్యాండ్ అయింది. విశేషం ఏమిటంటే చలి కారణంగా ఈ నది పూర్తిగా గడ్డకట్టింది. ఈ విమానంలో 30 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విమానానికి ఎటువంటి నష్టం జరగలేదు.

రష్యన్ ఎయిర్‌లైన్ విడుదల చేసిన ప్రకారం, యాకుటియా ప్రాంతంలోని జిర్యాంకా విమానాశ్రయం వద్ద రన్‌వేకి కొద్ది దూరంలో ఆంటోనోవ్-24 విమానం నదిపై ల్యాండ్‌ అయింది. ‘ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ప్రాంతీయ విభాగం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ విమాన ఘటనకు కారణం విమానాన్ని పైలట్, సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా తెలిసింది. ఈ విమానం 1959లో నిర్మించిన ఈ An-24 చిన్న, మధ్యస్థ దూర విమానయాన సంస్థల కోసం రూపొందించబడిందని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..