PM Modi: ఆసియాన్ సమ్మిట్‌ వేదికగా డ్రాగన్‌ కంత్రీ(కంట్రీ)కి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..!

|

Oct 11, 2024 | 1:27 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన లావోస్ పర్యటనలో రెండో రోజు 19వ తూర్పు ఆసియా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. భారతదేశం ఎల్లప్పుడూ ఆసియాన్ ఐక్యత, కేంద్రీకరణకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

PM Modi: ఆసియాన్ సమ్మిట్‌ వేదికగా డ్రాగన్‌ కంత్రీ(కంట్రీ)కి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..!
Pm Modi In 19th East Asia Summit
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన లావోస్ పర్యటనలో రెండో రోజు 19వ తూర్పు ఆసియా సదస్సుకు హాజరయ్యారు. 10 ASEAN సభ్య దేశాలు, ఎనిమిది భాగస్వామ్య దేశాలు ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, రష్యా, అమెరికా ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈ సమయంలో, ప్రధాని మోదీ ప్రపంచం మొత్తం శాంతి కోసం ఎదురుచూస్తోందని, ఇందుకు కోసం ప్రతిఒక్కరూ క‌ృషీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా, హిందూ మహాసముద్రంలో చైనా జోక్యాన్ని ఆయన లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ ఆసియాన్ ఐక్యత, కేంద్రీకరణకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత హోస్ట్, తదుపరి శిఖరాగ్ర సమావేశానికి హోస్ట్ తర్వాత తూర్పు ఆసియా సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానించిన మొదటి నాయకుడు ప్రధాని మోదీ కావడం విశేషం. ఇది ఒక పెద్ద విజయంగా చూడొచ్చు. ఇది ASEAN దేశాలలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతగా దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలలో అత్యధిక సార్లు పాల్గొన్న ఏకైక నాయకుడు ప్రధాని మోదీ. 19 తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు తొమ్మిది సార్లు ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) 1967లో స్థాపించబడింది. ఇందులో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, ఇండియా, వియత్నాం, లావోస్, కంబోడియా, బ్రూనై దారుస్సలాం సభ్య దేశాలుగా ఉన్నాయి. తూర్పు ఆసియా సమ్మిట్ (EAS) అనేది పాల్గొనే దేశాల అధినేతలు, ప్రభుత్వాల సమావేశం. ఇది ఏటా నిర్వహించడం జరుగుతుంది. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం 2005లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో మొదటి తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడంతో ప్రారంభమైంది. మొదట తూర్పు ఆసియా సదస్సులో 16 దేశాలు పాల్గొన్నాయి.

తూర్పు ఆసియా సమ్మిట్‌లో, ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఆసియాన్ ఐక్యత, కేంద్రీకరణకు భారతదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. భారతదేశ ఇండో పసిఫిక్ విజన్, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కేంద్రంగా ఉంది. భారతదేశ ఇండో పసిఫిక్ మహాసముద్రాల నియమ నిబంధనల చొరవతో, ఇండో ఆసియాన్, ఇండో-పసిఫిక్ ప్రాంతం శాంతి భద్రతల స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం కూడా తీవ్రమైన సవాల్ అని ప్రధాని మోదీ అన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే మానవత్వంపై విశ్వాసం ఉన్న శక్తులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

19వ తూర్పు ఆసియా సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అతిపెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేషియా అయినా, పశ్చిమాసియా అయినా శాంతి, సుస్థిరత వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. బుద్ధుని దేశం నుండి వచ్చాను,ఇది యుద్ధ యుగం కాదని పదే పదే చెబుతున్నానన్నారు ప్రధాని మోదీ. యుద్ధరంగం నుంచి సమస్యలకు పరిష్కారాలు దొరకవన్నారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మానవతా దృక్పథంతో, చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యదేశాలకు మోదీ సూచించారు. విశ్వ బుధుని బాధ్యతను నిర్వర్తిస్తూ, భారతదేశం ఈ దిశలో సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మయన్మార్‌లో పరిస్థితిపై ఆసియాన్ వైఖరికి మద్దతు ఇస్తున్నామని మోదీ తెలిపారు. ఐదు అంశాల ఏకాభిప్రాయానికి కూడా మేము మద్దతు ఇస్తున్నామన్నారు. అదే సమయంలో, మానవతా సహాయం, ప్రజాస్వామ్య పునరుద్ధరణను కొనసాగించడం చాలా ముఖ్యమని విశ్వసించారు. అందుకు తగినట్లుగా చర్యలు కూడా ఉండాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలపై పొరుగు దేశంగా భారతదేశం తన బాధ్యతను నిర్వర్తిస్తుందన్నారు. అలాగే ప్రపంచ శాంతిని కోరుకునే దేశంగా.. సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాల్లో కూడా పరస్పర సహకారం బలోపేతం కావాలన్నారు ప్రధాని మోదీ.

19వ తూర్పు ఆసియా సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యాగీ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో, ఆపరేషన్ సద్భావ్ ద్వారా మానవతా సహాయం అందించామని అన్నారు. తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. మిల్టన్ హరికేన్ కారణంగా జరిగిన ప్రాణనష్టంపై సెక్రటరీ బ్లింకెన్‌కు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..