PM Modi: ఢిల్లీ పేలుడుకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు: భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం భూటాన్ చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి భూటాన్ ప్రధాని స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధాని దృష్టి సారించనున్నారు. రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.

PM Modi: ఢిల్లీ పేలుడుకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు: భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Narendra Modi Maritime Week

Updated on: Nov 11, 2025 | 12:40 PM

రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం భూటాన్ చేరుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి భూటాన్ ప్రధాని స్వాగతం పలికారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం ప్రత్యేక సంబంధాలను బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1020 మెగావాట్ల పునత్సాంగ్చు-2 జలవిద్యుత్ ప్రాజెక్టును మోదీ, ఆదేశ ప్రధాని కింగ్ వాంగ్చుక్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. అలాగే భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జయంతి వేడుకలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

ఢిల్లీ పేలుడుకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదు

భూటాన్ చేరకున్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ రోజు చాలా బరువైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టిందన్నారు. బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానని.. దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో తాను ఎప్పికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. త్వరలోనే దర్యాప్తు సంస్థలు ఈ కుట్ర మూలాన్ని కనుగొంటారని.. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు.

భూటాన్‌లో ప్రధాని


ప్రధాని పర్యటన ముఖ్య ఉద్దేశం

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి, బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన జరుగుతున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతదేశం, భూటాన్ మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో, భారతదేశం రూ. 4,000 కోట్లకు పైగా వ్యయంతో భూటాన్‌తో రెండు క్రాస్-బోర్డర్ రైలు లింక్‌లను నిర్మించే ప్రణాళికను ప్రకటించింది, ఇది భూటాన్‌తో కలిసి భారత ప్రభుత్వం చేపట్టబోతున్న మొదటి రైలు కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తైతే భూటాన్‌లోని గెలేఫు, సామ్త్సే నగరాలు, అస్సాంలోని కోక్రాఝర్, పశ్చిమ బెంగాల్‌లోని బనార్హత్ మధ్య కొత్త రైల్వే లైన్స్ ఏర్పాటు కానున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us