PM Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ ప్రదానం

|

Mar 22, 2024 | 6:12 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పౌర గౌరవం దక్కింది. ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో'ను అందుకున్నారు. భూటాన్ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం.

PM Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో ప్రదానం
Pm Modi Bhutan Visit
Follow us on

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పౌర గౌరవం దక్కింది. ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీని ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో సత్కరించారు. ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

భూటాన్ రాజధానిలో ఇరువురు నేతలు భేటీ అయిన తర్వాత, భూటాన్ రాజు జిగ్మే ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గల్పోను ప్రదానం చేశారు. ర్యాంక్, ప్రాధాన్యత ప్రకారం, ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గల్పో జీవితకాల సాఫల్య పురస్కారంగా భూటాన్ ప్రభుత్వం భావిస్తుంది. ఇది భూటాన్‌లో అత్యున్నత గౌరవం. అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, భారతీయుడిగా జీవితంలో ఈరోజు గొప్ప రోజు అని, 140 భారతీయులకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు ఏ భారత ప్రధానికి రాజు ప్రైవేట్ విందు ఇవ్వలేదు. ప్రధాని మోదీకి ఈ ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు. కె5 రెసిడెన్స్ లింగనా ప్యాలెస్‌లో భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. భారత ప్రధానికి భూటాన్ అత్యున్నత పురస్కారం ఇవ్వడం తొలిసారి. నిజానికి భూటాన్‌ అవార్డు పొందిన తొలి విదేశీ పౌరుడు ప్రధాని మోదీ.

మోదీ అవార్డు స్వీకార ప్రసంగం 

భూటాన్ పర్యటన సందర్భంగా భూటాన్ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ మోదీని ఈ అవార్డుతో సత్కరించారు. థింపూలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మోదీ ప్రసంగించారు. “ఈ గౌరవం నా వ్యక్తిగత విజయం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల గౌరవం. ఈ గొప్ప భూటాన్ భూటాన్‌లోని భారతీయులందరి తరపున ఈ గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఈ గౌరవానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.

“భారతీయుడిగా నా జీవితంలో ఈరోజు గొప్ప రోజు. మీరు నన్ను భూటాన్ అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించారు. ప్రతి అవార్డు దానికదే ప్రత్యేకమైనది. కానీ మరొక దేశం నుండి అవార్డు అందుకున్నప్పుడు, రెండు దేశాలు సరైన దిశలో పయనిస్తున్నాయనే విశ్వాసాన్ని బలపరుస్తుంది. భారతదేశం – భూటాన్ మధ్య సంబంధాలు కొత్తవేమి కావని, మరియు సమకాలీనమైనవి, పురాతనమైనవి. 2014లో భారత ప్రధాని అయ్యాక, తొలి విదేశీ పర్యటనగా భూటాన్‌ను సందర్శించడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం భూటాన్ అందించిన స్వాగతం, ఆప్యాయత ప్రధానమంత్రిగా నా విధి పర్యటన ప్రారంభాన్ని చిరస్మరణీయం చేసింది.’’ అని అన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 22న భూటాన్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. భారతదేశం – భూటాన్‌ల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతోంది. పారో విమానాశ్రయంలో ప్రధానికి ప్రధాని షెరింగ్ టోబ్గే ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పీఎం టోబ్గేతో చర్చలు జరిపారు. పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థింపూ వరకు 45 కి.మీ పొడవునా ఇరువైపులా నిలబడి ఉన్న భూటాన్ ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. రాజధానిలో ప్రధాని మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వాటిలో ముఖ్యంగా గర్బా ప్రదర్శన, ఇందులోని పాటకు ప్రధాని మోదీ స్వయంగా పదాలు కలిపారు.

ఇదిలావుంటే భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ అవార్డును ఇప్పటివరకు కేవలం నలుగురికి మాత్రమే అందించారు. 2008లో, హర్ మెజెస్టి ది రాయల్ క్వీన్ అమ్మమ్మ ఆషి కేసంగ్ చోడెన్ వాంగ్‌చుక్ అవార్డును అందుకున్నారు. 2008లో J త్రిజుర్ టెన్జిన్ డెండుప్ (భూటాన్‌కు చెందిన 68వ జె ఖెన్పో), 2018లో జె ఖెన్పో ట్రుల్కు నావాంగ్ జిగ్మే చోడ్రా ద్వారా అందుకున్నారు. భూటాన్ కేంద్ర సన్యాసుల ప్రధాన నాయకుడు జె ఖెన్పో.

మరోవైపు భూటాన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అతిథ్యం లభించింది. ఇంతకు ముందు ఏ భారత ప్రధానికి భూటాన్ రాజు ప్రైవేట్ విందు ఇవ్వలేదు. కానీ ప్రధాని మోదీకి ఈ ప్రత్యేక హోదాను కల్పించారు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్. కె5 రెసిడెన్స్ లింగనా ప్యాలెస్‌లో భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. అలాగే విదేశీ ప్రతినిధికి భూటాన్ అత్యున్నత పురస్కారం ఇవ్వడం సైతం ఇదే తొలిసారి. నిజానికి భూటాన్‌ అవార్డు పొందిన తొలి విదేశీ పౌరుడు ప్రధాని మోదీ కావడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…