Donald Trump: ‘నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు’.. కచ్చితంగా భారత్‌పై టారిఫ్స్ పెంచి తీరుతాం..

గతేడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించింది. అయినప్పటికీ రష్యా- భారత్‌ ముడిచమురు వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ స్పందిస్తూ ఓవైపు సుంకాల పెంచుతానని హెచ్చరిస్తూనే.. మరోవైపు ప్రధాని మోదీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు.. కచ్చితంగా భారత్‌పై టారిఫ్స్ పెంచి తీరుతాం..
Modi Trump

Updated on: Jan 05, 2026 | 2:05 PM

ప్రధాని మోదీని ఆకాశానికెత్తుతూనే.. రష్యా చమురు వ్యవహారంలో భారత్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయకపోతే.. భారత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 50 శాతం భారీ టారిఫ్‌లను మరిన్ని రెట్లు పెంచుతామని ఆయన హెచ్చరించారు. గతేడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించింది. అయినప్పటికీ రష్యా- భారత్‌ ముడిచమురు వాణిజ్యం కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో ట్రంప్‌ స్పందిస్తూ ఓవైపు సుంకాల పెంచుతానని హెచ్చరిస్తూనే.. మరోవైపు ప్రధాని మోదీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పీఎం మోదీ చాలా మంచి వ్యక్తి అన్నారు. రష్యా చమురు విషయంలో తాను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. తనను సంతోషంగా ఉంచడం వారికి చాలా ముఖ్యం అంటూ మాట్లాడారు. ప్రధానిపై వ్యక్తిగతంగా గౌరవం ఉందంటూనే.. వాణిజ్య ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.