Phillippines president rodrigo duterte: ఆయన ఓ దేశానికి అధ్యక్షుడు.. కానీ దిగజారి ప్రవర్తించాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. ఓ మహిళ పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కాడు. ఆయన ప్రవర్తనపై నెటిజన్లందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన ఎవరంటే.. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే. ఇంట్లో పనిచేసే యువతి పట్ల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు నెటిజెన్లంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆదివారం రోజున రొడ్రిగో పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లోనే జరిగిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రొడ్రిగో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తన 76వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఇంట్లో వాళ్లు క్యాండిల్ వెలిగించిన కేక్‌లు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో పనిచేసే సహాయకురాలు.. మరో కేక్‌తో వచ్చింది. ఈ సందర్భంగా ఆ యువతి పట్ల రొడ్రిగో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో అందరూ రొడ్రిగోపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే అధ్యక్షుడిపై వస్తున్న విమర్శలపై అధ్యక్ష భవనం వివరణ ఇచ్చుకొచ్చింది. ఆయన కావాలని చేసిన చర్య కాదని, ఆయన భార్య కూడా అక్కడే ఉన్నందున దీన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది. అంతే కాకుండా రొడ్రిగోకు జోకులంటే చాలా ఇష్టమని, ఇలా చాలా మందిని ఆటపట్టిస్తుంటారంటూ వివరణ ఇచ్చింది.
ఇదిలాఉంటే.. 2018 లో డ్యూటెర్టే తన ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీంతోపాటు అనేక సందర్భాల్లో ఆయన మహిళల అసభ్యంగా ప్రవర్తించిన వార్తలున్నాయి.
“HAPPY 76th birthday big boss.” – Chammy Toot on Facebook
This is what really happened. pic.twitter.com/PsbLKm4FV7
— Miss Maggie (@MiaMagdalena) March 28, 2021
Also Read: