కార్ల వాడకంపై.. పారిస్ సంచలన నిర్ణయం

| Edited By:

Jun 28, 2019 | 9:28 PM

పారిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 60 శాతం కార్ల వినియోగంపై నిషేధం విధించింది. దీంతో రోడ్లపై సగానికి పైగా కార్లు తిరగలేవు. ప్రస్తుతం పారిస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధలను ఉల్లంఘించొద్దని.. అతిక్రమిస్తే చర్యలు తప్పబోవంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనంటూ వాహనదారులకు స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాహన […]

కార్ల వాడకంపై.. పారిస్ సంచలన నిర్ణయం
Follow us on

పారిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 60 శాతం కార్ల వినియోగంపై నిషేధం విధించింది. దీంతో రోడ్లపై సగానికి పైగా కార్లు తిరగలేవు. ప్రస్తుతం పారిస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధలను ఉల్లంఘించొద్దని.. అతిక్రమిస్తే చర్యలు తప్పబోవంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనంటూ వాహనదారులకు స్పష్టం చేసింది.

ఫ్రాన్స్‌లో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాహన కాలుష్య నివారణకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు పేర్కొంది. దేశంలో మొత్తం 5 మిలియన్ల కార్లు రిజిష్టర్ అయ్యాయి.

ఇప్పటికే దేశంలో నీటి వాడకంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాను ఫ్రాన్స్ ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు తాజాగా వాహనాల వినియోగంపై ఫ్రాన్స్ నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.