Pakistan Politics: అవిశ్వాస తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు.. గందరగోళం నడుమ పాక్ పార్లమెంట్‌లో ఏప్రిల్ 3కి వాయిదా!

|

Mar 31, 2022 | 7:17 PM

పాకిస్థాన్‌లో పరిస్థితి క్షణక్షణానికి మారిపోతోంది. విపక్షాల గందరగోళం మధ్య నేషనల్ అసెంబ్లీని ఆదివారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు డిఫ్యూటీ స్పీ్కర్

Pakistan Politics: అవిశ్వాస తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు.. గందరగోళం నడుమ పాక్ పార్లమెంట్‌లో ఏప్రిల్ 3కి వాయిదా!
Imran Khan
Follow us on

Pakistan Political Crisis: పాకిస్థాన్‌(Pakistan)లో పరిస్థితి క్షణక్షణానికి మారిపోతోంది. చర్చకు ముందు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ(National Assembly) డిప్యూటీ స్పీకర్ సభను ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానం(No Confidence Mottion)పై చర్చ ఏప్రిల్ 3న ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు 72 గంటల గ్రేస్ పీరియడ్ లభించింది. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించారు డిఫ్యూటీ స్పీ్కర్. సభను వాయిదా వేసిన అనంతరం విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ గో అంటూ నినాదాలు చేశారు. విపక్షాల గందరగోళం మధ్య నేషనల్ అసెంబ్లీని ఆదివారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు డిఫ్యూటీ స్పీ్కర్.

పీఎంఎల్(ఎన్) నేత షాబాజ్ షరీఫ్.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. పదవిలో కొనసాగే హక్కు ఆయనకు లేదన్నారు. మాకు మెజారిటీ ఉంది. మాకు అవకాశం ఇవ్వాలి. భారతదేశం పేరు తీసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని అన్నారు. స్పీకర్ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని పాకిస్థాన్ ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరోవైపు, అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని, పార్లమెంటును రద్దు చేయాలని విపక్షాలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ముందుకొచ్చారు. అయితే ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. విపక్షాలు తన సూచనను అంగీకరించకుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపినట్లు సమాచారం.

అయితే, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను విశ్వసించవద్దని సిఫార్సు చేశారని, ఈ తీర్మానంపై ఓటింగ్‌ను త్వరగా జరపాలని స్పీకర్‌ను కోరాలని సూచించారని వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతల అభిప్రాయం ప్రకారం, అధికార పగ్గాలు చేపట్టేందుకు మాకు పూర్తిస్థాయిలో సంఖ్యా బలం ఉంది. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై ప్రక్రియ త్వరగా పూర్తయితే, అప్పుడు మాకు ప్రయోజనం ఉంటుందని ప్రతిపక్షనేతలు నేషనల్ కాంగ్రెస్‌లో పట్టుబట్టారు.

జాతీయ అసెంబ్లీలో తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆయన రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటంతో, పాకిస్థాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సి) సమావేశానికి అధ్యక్షత వహించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సలహా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. గౌరవప్రదంగా ఇమ్రాన్ ఖాన్ వీడ్కోలు పలకాలని ఆయన అన్నారు. ఇక ప్రధాని పీఠం కాపాడుకోవడం అసంభవం. సురక్షితంగా నిష్క్రమించండి, ఇది బయలుదేరే సమయం అంటూ పేర్కొన్నారు. మీకు సేఫ్ పాసేజ్ లేదు, ఎన్‌ఆర్‌ఓ లేదు, బ్యాక్ ఎగ్జిట్ లేదు, గౌరవప్రదంగా ప్రభుత్వం నుంచి వైదొలిగే అవకాశం మీకు మాత్రమే ఉందని ప్రధానికి నేను ఒక్కటే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను అని బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. మీరు గౌరవప్రదంగా నిష్క్రమించండి, మీరు ఈ దేశపు క్రీడాకారుడు. మీరు ఒక్క ఇన్నింగ్స్ ఆడి ఓడిపోయారు. భవిష్యత్తు చాలా ఉంది అంటూ జోస్యం చెప్పారు.

Read Also… Karnataka High Court: భార్య అలా కోరడం తప్పేం కాదు.. విడాకుల కేసులో సంచలన తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..!