Watch: దేకని పుతిన్.. 40 నిమిషాలు గోర్లు కొరుకుతూ.. కూర్చున్న పాక్ ప్రధాని.. చివరకు!

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన చర్యలతో మరోసారి తన దేశానికి అవమానం తెచ్చిపెట్టారు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి ఆయన తుర్క్‌మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్‌కు వచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. షరీఫ్ పుతిన్‌ను కలవాలనుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు ఆయనను కలవడానికి ఆసక్తి చూపలేదు.

Watch: దేకని పుతిన్.. 40 నిమిషాలు గోర్లు కొరుకుతూ.. కూర్చున్న పాక్ ప్రధాని.. చివరకు!
Pakistan Pm Shehbaz Sharif, Russian President Vladmir Putin, Erdogan Meet

Updated on: Dec 12, 2025 | 8:29 PM

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన చర్యలతో మరోసారి తన దేశానికి అవమానం తెచ్చిపెట్టారు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి ఆయన తుర్క్‌మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్‌కు వచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు. షరీఫ్ పుతిన్‌ను కలవాలనుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు ఆయనను కలవడానికి ఆసక్తి చూపలేదు. అందుకే పుతిన్ కోసం షాబాజ్‌ను దాదాపు 40 నిమిషాలు వేచి ఉంచారు.

పుతిన్ కోసం దాదాపు 40 నిమిషాలు వేచి ఉన్న తర్వాత, షాబాజ్ షరీఫ్ టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగాన్ సమావేశంలోకి బలవంతంగా ప్రవేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. గేట్‌క్రాషింగ్ అంటే ఆహ్వానం లేకుండా పార్టీ, కార్యక్రమం లేదా వేదికలోకి ప్రవేశించడం లేదా హాజరు కావడం. దీనిని అనధికారిక ప్రవర్తనగా పరిగణిస్తారు.

పుతిన్ – షాబాజ్ ఇద్దరూ తుర్క్మెనిస్థాన్‌లో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. పుతిన్ వెనుక నేరుగా షాబాజ్ ఉన్నప్పటికీ , ఫోటో తీయడంలో పుతిన్ మొదట షాబాజ్‌ను పట్టించుకోలేదు . తరువాత, పుతిన్ – షాబాజ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగడానికి షెడ్యూల్ చేశారు. అయితే ఆ సమయంలో పుతిన్ – ఎర్డోగన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీ జరగడానికి షాబాజ్ 40 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది.

కాగా, షాబాజ్‌ను పుతిన్ విస్మరించడం ఇదే మొదటిసారి కాదు. ఆగస్టు నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో పుతిన్ కూడా షాబాజ్‌ను విస్మరించారు. భారతదేశంతో తనకు బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ, వారితో కూడా సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నానని షాబాజ్ తరువాత పుతిన్‌కు చెప్పాల్సి వచ్చింది.

ఇదిలావుంటే, తుర్క్‌మెనిస్తాన్ రాజధానిలో జరిగిన అంతర్జాతీయ శాంతి, విశ్వాస వేదిక ప్రారంభోత్సవంలో పుతిన్ మాట్లాడుతూ, “సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, డిసెంబర్ 12న, UN జనరల్ అసెంబ్లీ తుర్క్‌మెనిస్తాన్ తటస్థతను అధికారికంగా గుర్తించింది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, అభివృద్ధి నమూనా పట్ల గౌరవం, సంప్రదాయాల రక్షణ నేటి ప్రపంచానికి మరింత సందర్భోచితంగా ఉన్నాయి” అని అన్నారు. 2025 నాటికి వాణిజ్యం , శక్తి, రవాణా ప్రాజెక్టులు 35 శాతం విస్తరించనున్నాయని, రష్యా – తుర్క్‌మెనిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..