Pakistan vs India: మళ్లీ కపట నాటకాలు మొదలు పెట్టిన పాకిస్తాన్.. అతన్ని పట్టుకోవాలంటూ లేఖ.. మరి రిప్లై ఏంటో తెలుసా..

Pakistan: పాకిస్తాన్ మళ్లీ తన కపట నాటకాలు మొదలు పెట్టింది. ఆఫ్ఘన్‌లో ఉన్న మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్‌ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను..

Pakistan vs India: మళ్లీ కపట నాటకాలు మొదలు పెట్టిన పాకిస్తాన్.. అతన్ని పట్టుకోవాలంటూ లేఖ.. మరి రిప్లై ఏంటో తెలుసా..
India–pakistan

Updated on: Sep 15, 2022 | 6:33 AM

Pakistan: పాకిస్తాన్ మళ్లీ తన కపట నాటకాలు మొదలు పెట్టింది. ఆఫ్ఘన్‌లో ఉన్న మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్‌ జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను అరెస్టు చేయాలంటూ తాలిబన్లకు లేఖ రాసింది. అతను ఆప్ఘనిస్థాన్‌లోని నంగ్‌రహార్-కునార్ ప్రావిన్స్‌లో మసూద్ ఉన్నాడని తమకు సమాచారం ఉందని ఆ లేఖలో పేర్కొంది పాక్‌.. అయితే మసూద్‌ అజర్‌ తమ దగ్గర లేడని చెబుతున్నారు తాలిబన్లు. పాకిస్తాన్‌ నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని తెలిపారు. పైగా అతను పాకిస్తాన్‌లో ఉన్నాడని స్పష్టం చేసింది. మసూద్‌ అజార్‌ విషయంలోపాకిస్తాన్‌ కావాలనే కపన నాటకం ఆడుతోందని తెలుస్తోంది. ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌కు మందు ఆప్ఘన్‌కు ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమ్మిట్‌లో భారత్‌ మసూద్‌ వ్యవహారాన్ని లేవనెత్తే అవకాశం ఉందని పాక్‌ అనుమానిస్తోంది. మరోవైపు మసూద్‌ అజార్‌ను పట్టుకోవాలని పశ్చిమ దేశాల నుంచి పాకిస్తాన్‌పై వత్తిడి పెరింది. పాక్‌ ఉగ్రవాదులకు నిధులివ్వడం ఆపకుంటే గ్రే లిస్టు నుంచి బ్లాక్‌ లిస్టులోకి మారుస్తామని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆ దేశాన్ని ఇప్పటికే హెచ్చరింది. పాకిస్తాన్‌ మసూద్‌తో పాటు హఫీజ్‌ సయీద్‌, ఇతర ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని భారత్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో పాక్‌ మీద వత్తిడి పెరిగింది. మసూద్ అరెస్టు చేయలేక, తమ దేశంలో లేడంటూ పాక్‌ కొత్త నాటకం ఆడుతోందని అనుమానిస్తున్నారు. 2019లో పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత మౌలానా మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us