Pakistan UFO News: యుగాల నుంచి అనంత విశ్వంలో ఎప్పుడూ మానవుల మేధస్సుకు అందని వింతలు విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అవి మానవాళికి మిస్టరీగా ఉండి సవాల్ విసురుతుంటాయి. విశ్వంలో భూమితో పాటు అనేక గ్రహాలున్నాయి.. భూమి మీద మనుషులు నివసిస్తున్నట్లు ఇతర గ్రహాల మీద కూడా జీవులున్నాయని ఎప్పటినుంచో వాదన వినిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా గ్రహాంతర వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలేవీ లభించన్పటికీ .. యూఎఫ్ఓల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా మన పొరుగు దేశం పాకిస్థాన్ లో గ్రహాంతవాసుల కలకలం రేగింది. ఓ విమాన పైలెట్ ఆకాశంలో వెలిగిపోతున్న ఓ గుర్తు తెలియని వస్తువును గుర్తించాడు. ఈ విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
జనవరి 23న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ చెందిన ఓ విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలు దేరింది. విమానం ప్రయాణిస్తున్న మార్గ మధ్యంలో రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో ఫైలెట్లు ఆకాశంలో ఓ వింత వస్తువును గుర్తించారు. ఆకాశంలో దర్శనమిచ్చిన కాంతివంతమైన వస్తువు పైలట్ తోపాటు సాయంత్రం వేళ కావడంతో ఆ వస్తువు కిందనున్న ప్రజలకు కూడా దర్శనమిచ్చింది. దాంతో చాలామంది దాన్ని వీడియో తీశారు. ఆ గుర్తు తెలియని వస్తువు గురించి పీఐఏ పైలట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. అయితే, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కానీ, లేక మరేదైనా భారీ ఉపగ్రహం కానీ అయ్యుండొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు స్థానికులు మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు, ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్పారు. కాసేపటికి ఎర్రటి రంగులోకి మారిందని అంటున్నారు. ఆకాశంలో వేగంగా ముందుకు కదులుతూ వెళ్లిందని.. దాదాపు గంట తర్వాత మాయమైపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సాధారణ కంటికి కూడా చాలా స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.మొత్తం మీద పాక్ లో కనిపించిన ఈ కాంతి వంతమైన వస్తువు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.