కరాచీ, ఆగస్టు 31: అడవిలో ఉండే కౄరమృగాలు సైతం మృగరాజును చూసి అల్లంత దూరం పరుగు లంకించుకుంటాయి. అలాంటిది నగరంలోని పట్టపగలు వాహనాలు అటూఇటూ తిరుగుతూ రద్దీగా ఉండే బిజీ రోడ్లపై సింహం నడుస్తుంటే అసలెవ్వరూ భయపడటం లేదు. పైగా అదేదో గ్రామ సింహంలా క్యాజువల్‌గా చూస్తున్నారు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్‌లోని కరాచిలో మంగళవారం (ఆగస్టు 29) సాయంత్రం చోటుచేసుకుంది.
పాకిస్థాన్‌లో కరాచీలో రద్దీగా ఉన్న షరియా ఫైసల్ నగర రోడ్లపై మంగళవారం సాయంత్రం ఊహించని విధంగా సింహం ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై సింహం దర్జాగా నడుచుకుంటూ షికారుకెళ్లింది. కొంతమంది బాటసారులు సింహాన్ని గమనించకుండా దానికి దారిచ్చి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు. కాసేపటికీ కొందరు గమనించి సింహాన్ని చూసేందుకు గుంపులుగా గుమిగూడారు.
నగరంలోని ఆయేషా బవానీ కాలేజీ సమీపంలోని ఓ బిల్డింగ్ పార్కింగ్ వద్దకు చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సింహాన్ని బంధించేందుకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనంలో తరలిస్తుండగా సింహం పొరపాటున రోడ్లపైకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. గంటపాటు శ్రమించి సింహాన్ని రక్షించారు. దాని తరలిస్తోన్న వాహనం డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
A lion was caught on camera walking down Shahrah-e-Faisal, the main artery of the city, on Tuesday evening.
The pedestrians and car passengers passing by were caught in surprise witnessing a wild life animal roaming around the busiest roads of Karachi. #etribune #Karachi… pic.twitter.com/dcHDS1SOOI
— The Express Tribune (@etribune) August 29, 2023
వన్యప్రాణుల చట్టాల ప్రకారం నివాస ప్రాంతాల్లో సింహాలను వదిలడం చట్టరిత్యా నేరం అని కన్జర్వేటర్ సింధ్ వన్యప్రాణి విభాగం జావేద్ మెహర్ తెలిపారు. దేశంలో బ్లాక్ మార్కెట్ ఉందని, అడవి జంతువుల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు జావేద్ మెహర్ పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.