Sugar free Mangoes: చక్కర రహిత మామిడి పండ్లు.. తిన్నారంటే వదిలి పెట్టరు.. పాకిస్తాన్ వ్యవసాయవేత్త సృష్టి!

|

Jun 26, 2021 | 7:04 PM

Sugar free Mangoes : మామిడి పండ్ల సీజన్ అందరికీ ఎంతో ఇష్టమైనది. రకరకాల మామిడి పండ్లు మార్కెట్ లో వచ్చేస్తాయి. చూస్తూనే తినాలనిపించేలా మామిడి పండ్లు ఈ సీజన్ లో అందరికీ అందుబాటులో వచ్చాయి.

Sugar free Mangoes: చక్కర రహిత మామిడి పండ్లు.. తిన్నారంటే వదిలి పెట్టరు.. పాకిస్తాన్ వ్యవసాయవేత్త సృష్టి!
Sugar Free Mangoes
Follow us on

Sugar free Mangoes : మామిడి పండ్ల సీజన్ అందరికీ ఎంతో ఇష్టమైనది. రకరకాల మామిడి పండ్లు మార్కెట్ లో వచ్చేస్తాయి. చూస్తూనే తినాలనిపించేలా మామిడి పండ్లు ఈ సీజన్ లో అందరికీ అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు ఎక్కడైనా మామిడి పండు మధురిమలే. రకరకాల మామిడి రుచులు అందరినీ ఆహ్లాదపరుస్తున్నాయి. అందరికీ, మామిడి పండు అంటే విపరీరమైన ఇష్టం. కానీ, డయాబెటీస్ తో బాధపడేవారు మామిడి పండు తినాలంటే ఇబ్బందే. షుగర్ పెరిగిపోతుందనే భయం. పాపం నోరూరిపోతున్నా మామిడి పండు చూసి ఆనందించడం తప్ప ఒక్క ముక్క నోటిలో పెట్టుకోలేరు చక్కర వ్యాధి ఉన్నవారు. వారి కోసం పాకిస్తాన్ లో మూడు రకాల చక్కర రహిత మామిడి పండ్లు పండించారు.

పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలోని టాండో అల్లాహార్‌లోని ఎం హెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి నిపుణుడు శాస్త్రీయ మార్పు చేసిన మూడు రకాల మామిడి పండ్లను అభివృద్ధి చేసి పండిస్తున్నారు. వాటికి సోనారో, గ్లెన్, కీట్ అనే పేర్లు పెట్టారు. ఈ మామిడి పండ్లు ఇప్పుడు పాకిస్తాన్ మార్కెట్ లో లభిస్తున్నాయి.

ఎం హెచ్ పన్వర్ మేనల్లుడు, మామిడి పంటల నిపుణుడు గులాం సర్వార్ మీడియాతో మాట్లాడుతూ, “మామిడి, అరటితో సహా పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సీతారా-ఎ-ఇమ్తియాజ్‌ను పన్వర్‌కు ప్రదానం చేసింది. ఆయన మరణం తరువాత, నేను ఈ పనిని కొనసాగించాను. ఈ వాతావరణంలో, మట్టిలో వాటి పెరుగుదలను పరీక్షించడానికి వివిధ రకాల మామిడి పండ్లను [విదేశీ దేశాల నుండి] దిగుమతి చేసుకున్న తరువాత మార్పులు చేసాను. ” అని చెప్పారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేకుండా ఈ ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాతిపదికన నడుపుతున్నామని, వారి 300 ఎకరాల పొలంలో 44 మామిడి గుణాత్మక రకాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

సర్వార్ చెబుతున్న దాని ప్రకారం, అతను పండ్ల జీవితకాలం పెంచడానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిని నియంత్రించటానికి, కొత్త రకాలను పరిచయం చేయడానికి, ఉత్పత్తిని మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను కనుగొనడంపై దృష్టి పెట్టాడు. పాకిస్తాన్ లో లభించే సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15 శాతం చక్కెర ఉండగా, తన పొలంలో కొన్ని రకాలు కేవలం 4-5 శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. “కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది, సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6 శాతం మరియు 6 శాతం వరకు ఉన్నాయి.” అని ఆయన మీడియాకు వివరించాడు. ఈ మామిడి పండ్ల ధర సాధారణ ధరలకు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ చక్కర రహిత మామిడిపండ్లు ప్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లలో కిలోకు 150 రూపాయల ధరకు అమ్ముతున్నారు.

Also Read: India International Travel: సెకండ్ వేవ్ తర్వాత భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తున్న దేశాలు ఇవే.. కండిషన్స్ అప్లై

The Black Tiger: పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా