Viral Video: ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వేసేశాడు.. గాడిదతో పోల్చుకుని నవ్వుల పాలైన పాక్ మాజీ ప్రధాని..

Pakistan: తనను తాను గాడిదతో పోల్చుకుంటూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయారు.

Viral Video: ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వేసేశాడు.. గాడిదతో పోల్చుకుని నవ్వుల పాలైన పాక్ మాజీ ప్రధాని..
Imran Khan
Image Credit source: TV9 Telugu

Updated on: May 07, 2022 | 4:17 PM

Pakistan Ex-PM Imran Khan: ముందూ వెనుకా ఆలోచించకుండా నోరు జారడం.. ఆ తర్వాత తల పట్టుకోవడం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అలవాటుగా మారింది. గతంలో పలు సందర్భాల్లో మీడియా ముందు ఇలా నోరుజారి అబాసుపాలైన ఇమ్రాన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన అసంబద్ధ వ్యాఖ్యలతో మరోసారి నవ్వులపాలవుతున్నారు. తనను తాను గాడిదతో పోల్చుకుంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయారు.

ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రిటన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కడ తనకు ఎంతో మంది సన్నిహితులు, స్నేహితులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. బ్రిటన్‌ను తాను ఎప్పుడూ మాతృగడ్డగా భావించలేదన్నారు. తాను ఎంతో కాలం బ్రిటన్‌లో ఉన్నా.. తన మాతృదేశం పాకిస్థానే అంటూ పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా గాడిదకు రంగులు వేసినంత మాత్రాన అది జీబ్రా కాదు.. గాడిద ఎప్పటికీ గాడిదే అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో ఉన్నంత మాత్రాన తాను ఎప్పటికీ బ్రిటీషర్ కాలేనని అన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇమ్రాన్ ఖాన్ తనను గాడిదతో పోల్చుకోవడంపై నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. ఇమ్రాన్ కామెంట్స్‌పై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు సెటైర్లతో దంచికొడుతున్నారు. 69 ఏళ్లకు ఇమ్రాన్ ఖాన్‌కు జ్ఞానోదయం కలిగిందంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. అటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇదే అదునుగా ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు.

Also Read..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షలకు తొలిరోజే 22,210 మంది విద్యార్ధులు గైర్హాజరు.. కారణం ఇదే!

Amit Shah – Sourav Ganguly: దాదా ఇంట్లో అమిత్ షా డిన్నర్.. హీటెక్కిన బెంగాల్ రాజకీయం..