
ప్రస్తుతం భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు చర్యలు తీసుకుంది. దాంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం ఎప్పుడైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. వారం రోజుల వ్యవధిలో ఆ దేశంలో ఇది రెండవ భూకంపం. ఏప్రిల్ 30న పాకిస్తాన్‌ను 4.4 తీవ్రతతో భూకంపం తాకిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదించింది.
భూకంప వివరాలను NCS ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఆ దేశంలో భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా, పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా, భారత టెక్టోనిక్ ప్లేట్‌లను అతివ్యాప్తి చేస్తుంది. బలూచిస్తాన్, సమాఖ్య పరిపాలన గిరిజన ప్రాంతాలు, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్సులు ఇరానియన్ పీఠభూమిపై యురేషియా ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రావిన్సులు దక్షిణాసియాలోని భారత ప్లేట్ వాయువ్య అంచున ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి