
ఉగ్రవాదుల ఏరివేత షురూ అయింది. పహల్గామ్ దాడిలో 26 మంది భారతీయులను బలితీసుకున్న ఉగ్రమూకలు మళ్లీ కవ్మింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత భద్రతా దళాలు ఉగ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నారు సైనికులు. భారతదేశం యాక్షన్‌లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, అమెరికాలకు పంపించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఉగ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి. పాకిస్తాన్‌పై చర్య తీసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశంతో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారి సరిహద్దు నుండి రాకపోకలు నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది. వారిని 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి, భారతదేశం విడిచి వెళ్ళడానికి గడువు ముగిసిన తర్వాత ఏ ఒక్క పాకిస్తానీ వ్యక్తి దేశంలో ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఒకవైపు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే తమ వారిని సేఫ్ జోన్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నారు. దీంతో భారత్-పాక్ మధ్య ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..