Ōzu Castle: ఈ ప్యాలెస్ కి రాజు కావచ్చు.. రాజభోగాలు అనుభవించవచ్చు.. అద్దె మాత్రం షాక్ ఇస్తుంది

|

Apr 01, 2024 | 10:03 AM

డబ్బు ఎక్కువగా ఉన్నవారు రాజులు, చక్రవర్తుల్లా  విలాసంగా, వైభవంగా జీవితాన్ని గడుపుతారు. డబ్బులు లేని వారు తమ జీవితం కూడా అలాగే ఉండాలని కలలు కంటారు. మీరు కూడా అలాంటి కల కంటే పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మీరు నేరుగా జపాన్‌కు వెళ్లండి. అక్కడ రాజభవనం ఉంది. మీరు అక్కడ రాజు కావచ్చు. రాజభోగాలను అనుభవించవచ్చు. అయితే ఈ రాజభవనంలో ఉండటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

Ōzu Castle: ఈ ప్యాలెస్ కి రాజు కావచ్చు.. రాజభోగాలు అనుభవించవచ్చు.. అద్దె మాత్రం షాక్ ఇస్తుంది
Ozu Castle Is Japan
Image Credit source: Instagram/kamaaachan/ozu_castle_stay
Follow us on

సినిమాల్లో , కథల్లో వినే రాజభోగాల గురించి అలా రాజులా జీవించడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అవును సకల సౌఖ్యాలు, విలాసాలు లభించే రాజభవనాల్లో నివసించడం, రాజులా జీవించడం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అయితే అందరి కలలు నిజం కావు. డబ్బు ఎక్కువగా ఉన్నవారు రాజులు, చక్రవర్తుల్లా  విలాసంగా, వైభవంగా జీవితాన్ని గడుపుతారు. డబ్బులు లేని వారు తమ జీవితం కూడా అలాగే ఉండాలని కలలు కంటారు. మీరు కూడా అలాంటి కల కంటే పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మీరు నేరుగా జపాన్‌కు వెళ్లండి. అక్కడ రాజభవనం ఉంది. మీరు అక్కడ రాజు కావచ్చు. రాజభోగాలను అనుభవించవచ్చు. అయితే ఈ రాజభవనంలో ఉండటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ ప్యాలెస్ జపాన్‌లోని ఎహిమ్ ప్రావిన్స్‌లోని ఓజు నగరంలో ఉంది. దీని పేరు ఓజు కాజిల్. ఈ కోట చెక్కతో చేసినప్పటికీ చాలా అందంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఈ నాలుగు అంతస్తుల ప్యాలెస్‌లో రాత్రంతా రాజులా విలాసవంతంగా జీవిస్తారు. కావాలంటే నువ్వు కూడా ఈ రాజభవనానికి రాజు అయి రాజులా తిని పడుకో. ఈ ప్యాలెస్‌లో ఓజు చివరి రాజు కటో డైమ్యోస్‌లా జీవించే అవకాశం లభిస్తుందని చెబుతారు.

ఒక రాత్రి ధర 8 లక్షలు

నివేదికల ప్రకారం 16వ శతాబ్దంలో ఓజు రాజు ఈ ప్యాలెస్‌లో విలాసవంతంగా నివసించినట్లు, అతిథులు కూడా ఇక్కడ బస చేసినట్లు తెలుస్తోంది. అయితే,.. ఇప్పుడు ఉన్న ప్యాలెస్ ఆ యుగపు కోట కాదు.  ఎందుకంటే అసలు ఓజు కోట 1888 సంవత్సరంలో దెబ్బతింది. ఆ తర్వాత 1990లో కోటను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్యాలెస్ చెక్కతో చేసినప్పటికీ.. ప్యాలెస్ లో బస చేసేందుకు ఒక రాత్రికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అతిథిని రాజులా స్వాగతిస్తారు

ఈ ప్యాలెస్‌కి వచ్చే అతిథులకు చాలా ప్రత్యేకమైన రీతిలో స్వాగతం పలుకుతారు. మొదట ఓజు  సాంప్రదాయ సంగీతాన్ని ప్లే చేస్తారు. అతిథిని రాజు వేషధారణలో అలంకరిస్తారు. అప్పుడు కొంతమంది ఆర్మీ యూనిఫారం ధరించిన వ్యక్తులు అతిథులను ప్యాలెస్ లోపలికి తీసుకువెళతారు. అక్కడ వారి ముందు సాంప్రదాయ నృత్యం ప్రదర్శించబడుతుంది. అప్పుడు రాజుల స్టైల్ లో విందు ఉంటుంది. విందు సమయంలో  కవితా పఠనంతో పాటు, మధురమైన సంగీతం కూడా ప్లే అవుతూనే ఉంటుంది. మొత్తానికి  ఇక్కడ బస చేసే అతిథులకు రాజుల అనుభూతి కలుగుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..