జింబాబ్వేలో ‘ఇడాయ్’ తుపాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

హరారే : ‘ఇడాయ్’ తుపాన్ జింబాబ్వేను అతలాకుతలం చేస్తోంది. తుపాను దాటికి ఇప్పటికే 100మందకి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో గల్లంతయ్యారు. జింబాబ్వే దేశంలోని తూర్పు జిల్లా చిమనీమణి గ్రామంలో వరదనీరు పోటెత్తడంతో గ్రామస్థులు పలువురు కొట్టుకుపోయారని స్థానిక ప్రజాప్రతినిధిలు తెలిపారు. తుపాన్ ప్రభావం వల్ల న్యాహోదీ నది పొంగి ప్రవహించింది. దీంతో ప్రభుత్వ గృహాలు నీటమునిగాయి. తుపాన్ వల్ల పలు వంతెనలు దెబ్బతినడంతో సహాయ పునరావాస పనులకు విఘాతం వాటిల్లింది. జింబాబ్వే మిలటరీ అధికారులు […]

జింబాబ్వేలో ‘ఇడాయ్’ తుపాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Edited By:

Updated on: Mar 18, 2019 | 10:20 AM

హరారే : ‘ఇడాయ్’ తుపాన్ జింబాబ్వేను అతలాకుతలం చేస్తోంది. తుపాను దాటికి ఇప్పటికే 100మందకి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో గల్లంతయ్యారు. జింబాబ్వే దేశంలోని తూర్పు జిల్లా చిమనీమణి గ్రామంలో వరదనీరు పోటెత్తడంతో గ్రామస్థులు పలువురు కొట్టుకుపోయారని స్థానిక ప్రజాప్రతినిధిలు తెలిపారు. తుపాన్ ప్రభావం వల్ల న్యాహోదీ నది పొంగి ప్రవహించింది. దీంతో ప్రభుత్వ గృహాలు నీటమునిగాయి. తుపాన్ వల్ల పలు వంతెనలు దెబ్బతినడంతో సహాయ పునరావాస పనులకు విఘాతం వాటిల్లింది. జింబాబ్వే మిలటరీ అధికారులు రంగంలోకి దిగి సహాయ పునరావాస పనులు చేపట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్ మంగాగ్వా తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని తుపాన్ సహాయపనులను పర్యవేక్షించేందుకు స్వదేశానికి తిరిగివచ్చారు. తుపాన్ ప్రభావం వల్ల ఇళ్లతోపాటు పంటలు నీట మునిగాయి. తుపాన్ ప్రభావం వల్ల మలావీ, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో 8,50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.