Donald Trump: యుద్ధం ఇప్పట్లో ఆగదు.. 2-3వారాల్లో భీకర దాడులు చేస్తాం- ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వైట్ హైస్‌లో జాతిని ఉద్దేశిస్తూ ప్రసగించిన ఆయన.. యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే ప్రసక్తే లేదని అన్నారు. రెండు మూడు వారల్లో భీకర దాడులు జరుగుతాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామన్నారు. తప తొలి టర్మ్‌లోనే ఇరాన్ కీలక నేతలను అంతం చేశామని.. ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను ధ్వంసం చేశామన్నారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్టు పేర్కొన్నారు.

Donald Trump: యుద్ధం ఇప్పట్లో ఆగదు.. 2-3వారాల్లో భీకర దాడులు చేస్తాం- ట్రంప్ సంచలన ప్రకటన
American President Donald Trump

Updated on: Apr 02, 2026 | 9:18 AM

ఇరాన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలకవ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే పరిస్థితి లేదన్నారు. పరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ కొనసాగుతుందిని స్పష్టం చేశారు. 2-3 వారాల్లో మరిన్ని భీకరదాడులు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. వైట్‌ హైస్‌ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగిచిన ఆయన ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నేతలను అంతం చేశామని, ఇరాన్ ఎర్‌ఫోర్స్, నేవిలను నిర్వీర్యం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామన్నారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్టు చెప్పుకొచ్చారు.

మా లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేదాకా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ కొనసాగుతుందని నేను మొదటినుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఇందులో ఇప్పటిదాకా పురోగతి కనిపించిందని.. అమెరికా సైనిక లక్ష్యాలు చేరుకోవడంలో మేం సరైన దిశలోనే వెళుతున్నామన్నారు. ఇరాన్‌ను మళ్లీ వారి రాతియుగంలోకి తీసుకెళతామన్నారు.అదేసమయంలో ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. ఇరాన్‌ నాయకత్వ మార్పిడి తమ లక్ష్యం కాదని.. కానీ ఇరాన్‌లోని నాయకులు చనిపోవడం వల్లే నాయకత్వ మార్పిడి జరిగిందన్నారు.

అయిల్‌ కోసం పశ్చిమాసియాపై ఎప్పుడూ ఆదారపడకూడదన్నారు. గత అధ్యక్షుడు చేసిన తప్పుల్ని తాను సరిచేస్తున్నానన్నాడు. తాను ఐదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించానని.. అమెరికాను ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశాంగా మార్చామన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని.. అమెరికాలో ఇంధన సమస్య తాత్కాలికమేనన్నారు. తమకు హర్మూజ్‌ జలసంధి అవసరం లేదని.. అమెరికాలో పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నారు.

వైరల్‌గా మారిన ఇరాన్ లేఖ

ట్రంప్ ప్రకటనకు ముందే ఓ లేఖ వైరల్‌గా మారింది. అందులో ఇరాన్ కాల్పుల విరమణ కోరుతోందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొనగా, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయీ ఆ వ్యాఖ్యలను అబద్ధమని కొట్టిపారేసినట్టు పేర్కొన్నారు. అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖను అమెరికా ప్రభుత్వానికి కాకుండా, అమెరికా ప్రజలను ఉద్దేశించి రాశారు ఆయన తెలిపాడు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మూసివేత గురించి ఆయన తన లేఖలో ప్రస్తావించలేదన్నారు.

ఇరాన్ ప్రజలకు అమెరికా, యూరప్ లేదా పొరుగు దేశాల ప్రజలతో సహా ఏ ఇతర దేశాల పట్ల శత్రుత్వం లేదనిని పేర్కొన్నారు.చరిత్రలో విదేశీ జోక్యాలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఇరాన్ ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వాలకు, ఆ దేశ ప్రజలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తారరన్నారు. ఇది ఇరాన్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన సూత్రమని.. కేవలం తాత్కాలిక రాజకీయ వైఖరి కాదని పేర్కొన్నారు.

 

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us