భారత్‌ జరిపిన దాడుల్లో అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయా..? రేడియోషన్‌ లీక్‌ అవుతుందా?

కిరానా హిల్స్‌.. రెండేళ్లుగా భారత రాడార్లో ఉన్న ప్రాంతం ఇది. పాకిస్తాన్‌లోని హయ్యెస్ట్‌ సెక్యూర్డ్‌ ఏరియా అయిన ఈ కొండల్లో అణ్వాయుధాలున్నాయా? ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా భారత్‌ జరిపిన దాడుల తర్వాత అక్కడి అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయా? అమెరికా దీనిపై ఏమంటోంది? తెలుసుకుందాం.

భారత్‌ జరిపిన దాడుల్లో అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయా..? రేడియోషన్‌ లీక్‌ అవుతుందా?
Kirana Hills

Updated on: May 15, 2025 | 7:14 AM

కిరానా హిల్స్‌.. రెండేళ్లుగా భారత రాడార్లో ఉన్న ప్రాంతం ఇది. పాకిస్తాన్‌లోని హయ్యెస్ట్‌ సెక్యూర్డ్‌ ఏరియా అయిన ఈ కొండల్లో అణ్వాయుధాలున్నాయా? ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా భారత్‌ జరిపిన దాడుల తర్వాత అక్కడి అణ్వాయుధాలు ధ్వంసం అయ్యాయా? అమెరికా దీనిపై ఏమంటోంది? తెలుసుకుందాం.

కిరానా హిల్స్‌లో అణు సంబంధిత సామాగ్రి ఉందని చెప్పినందుకు ధన్యవాదాలు, మాకైతే దాని గురించి తెలియదు. అక్కడ ఏముందో దానిపై మేం దాడి చేయలేదు. చాలా చమత్కారంగా సమాధానం చెప్పిన మన ఎయిర్‌ మార్షల్‌ అవధేష్‌ కుమార్‌ అంతరార్ధం మాత్రం చాలా మంది పసిగట్టారు. తాము తల్చుకుంటే పాకిస్తాన్‌లో ఎక్కడైనా దాడులు చేయగలమని చెప్పకనే చెప్పారు అవధేష్‌ కుమార్‌ భారతి.

కిరానా హిల్స్‌… పాకిస్తాన్‌కు అది ‘ఏరియా 51’ లాంటిది. ప్రజలు ఎవవరిని అక్కడకు అనుమతించరు. హై సెక్యూర్డ్‌ జోన్‌లో ఉండే ప్రాంతం. అక్కడ ఏమున్నాయో ఆ దేశస్థులకే తెలియదు. సర్గోదా ఎయిర్‌ బేస్‌కు చాలా దగ్గరిలో ఉన్న ఈ కిరానా హిల్స్‌లో పాకిస్తాన్‌ అణ్వాయుధాలు ఉన్నట్లు చాలా రోజుల నుంచి ఉన్న టాక్‌. అయితే ఈ కిరానా హిల్స్‌పై భారత్‌ దాడి చేసింది అనేది సెన్సేషనల్‌ న్యూస్‌. భారత DGAO ఎయిర్‌ మార్షనల్‌ అవధేష్‌ కుమార్‌ భారతి మాటల్లోనే తెలుస్తోంది. అక్కడ అణ్వాయుధాలున్నాయా? చెప్పినందుకు థ్యాంక్స్‌ అనడంతో ఆ హాల్‌లో కూర్చున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అంటే కిరానా హిల్స్‌లో ఏముందో ఆయనకు కూడా తెలుసు. కాకపోతే అలాంటి విషయాలు బయటకు చెప్పరు.

ఇప్పుడు ఈ కిరానా హిల్స్‌ నుంచి రేడియో ధార్మిక ఉద్గారాలు వెలువడుతున్నాయన్నది మరో బిగ్‌ న్యూస్‌. న్యూక్లియర్‌ రేడియోషన్‌ లీక్‌ అవడం అనేది ప్రపంచ దేశాలనే కలవరం పెడుతోంది. అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. ఆపరేషన్‌ సింధూర్‌ లో భాగంగా జరిగిన దాడిలో కిరానా హిల్స్‌లో నిల్వ ఉంచిన అణ్వాయుధాల నుంచి ఈ ధార్మికత వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. అమెరికా కూడా దీనిపై దర్యాప్తు చేయడానికి ఓ స్పెషలిస్ట్‌ టీమ్‌ను పాకిస్తాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే ఆయన కూడా పరోక్షంగా న్యూక్లియర్‌ లీకేజీ జరుగుతున్నట్లు ఒప్పుకున్నారు. సర్గోదా, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌లపై దాడి చేసినట్లు భారత్‌ ప్రకటించింది. అదే సమయంలో సర్గోదా ఎయిర్‌బేస్‌కు దగ్గరగా ఉన్న కిరానా హిల్స్‌పైనా బాంబు దాడులు చేసి పాక్‌ను హెచ్చరించింది భారత్‌.

సర్గోదా, నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌లతోపాటు.. పాకిస్తాన్‌ రాడార్‌, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఉన్న రఫీఖీ, మురిద్కే, చక్లాలా, రహీం యార్‌ ఖాన్‌, సఖ్ర్‌, చునియాన్‌, పస్రూర్‌, సియాల్‌కోట్‌లపై దాడులు చేసి వారి విపణులను నాశనం చేసింది భారత్‌. అయితే 2023లో వెలువడిన ఓ కథనం ప్రకారం కిరానా హిల్స్‌లో భారీగా ఆయుధాలు, ట్రాన్స్‌పోర్టర్‌ ఎరెక్టర్‌ లాంచర్, గ్యారేజీలు, పది అండర్‌గ్రౌండ్‌ స్టోరీజీ ఫెసిలిటీలు ఉన్నట్లు బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ కిరానా హిల్స్‌పై ఓ కన్నేసి ఉంచింది భారత్‌. ఇప్పుడు టైమ్‌ దొరకగానే దానిపై బాంబు దాడులు చేసి.. మీ దేశంలో ఏ మూలనైనా దాడులు చేయగలం, అవసరం అయితే వారి న్యూక్లియర్‌ బాంబులు అక్కడే పేల్చేయగలమంటూ సందేశాన్ని పంపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..