Kim Jong-un: రెచ్చగొడితే అణు బాంబు వేస్తా.. అమెరికాకు కిమ్ మామ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Kim Jong-un warns US: తమను రెచ్చగొడితే అణుబాంబు వేస్తామని అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు కిమ్‌.. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సంలో తమ ఆయుధ సంపత్తిని లోకానికి చాటింది.

Kim Jong-un: రెచ్చగొడితే అణు బాంబు వేస్తా.. అమెరికాకు కిమ్ మామ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Kim Jong Un

Updated on: Apr 27, 2022 | 7:13 AM

Kim Jong-un warns US: తమను రెచ్చగొడితే అణుబాంబు వేస్తామని అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు కిమ్‌.. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సంలో తమ ఆయుధ సంపత్తిని లోకానికి చాటింది. ఉత్తర కొరియా సైన్యం 90వ వార్షికోత్సవం రాజధాని ప్యాంగ్యాంగ్‌ను భారీ ఎత్తున జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తమ అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఇందులో భారీ అణ్వాయుధాలు, క్షిపణులు ఉన్నాయి. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ పరేడ్‌లో రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేక దుస్తులతో ఆకర్శనీయంగా కనిపించారు.. కిమ్‌ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. వేలాది మంది ప్రజలు జయజయధ్వానాలతో కిమ్‌కు సంఘీభావం తెలిపారు.

తమ దేశం ఆంక్షల నుంచి మినహాయింపులు పొందడమే లక్ష్యంగా అణు పరీక్షలు కొనసాగిస్తోందని కిమ్‌ పరేడ్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు. తమ మొదటి మిషన్‌ అణ్వాయుధ బలగాల ప్రాథమిక లక్ష్యం యుద్ధాన్ని నివారించడమేనన్నారు.. అనివార్యం అయితే రెండో మిషన్‌గా అణ్వాయుధాలను ప్రయోగించడమేనని హెచ్చరించారు.. మా ప్రయోజనాలకు అడ్డు తగిలితే శత్రువు అస్థిత్వాన్ని కోల్పోవాల్సిందేనని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు కిమ్‌.. క్తిమంతమైన ఆత్మరక్షణ సామర్థ్యం ఉంటేనే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలమన్నారాయన..

ఈ పరేడ్‌లో ఖండాంతర క్షిపణి హ్వాసంగ్‌-17 ప్రధాన ఆకర్శనగా నిలిచింది.. ఈ బాలిస్టిక్‌ క్షిపణి ఆరు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించి అమెరికాను తాక గలదని భావిస్తున్నారు.. ఈ క్షిపణిని ఉత్తర కొరియా ఈ ఏడాది మార్చిలో విజయవంతంగా ప్రయోగించింది. కరోనాతో ఆర్థికంగా కుదేలైనప్పటికీ.. క్షిపణి ప్రయోగాల్లో మాత్రం దూకుడు తగ్గించలేదు ఉత్తర కొరియా.

Also Read:

Kamala Harris: అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌస్ అలర్ట్..

Solar Eclipse: ఏప్రిల్‌ 30న తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..? నాసా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?